ఇస్రో: చంద్రయాన్-3 ప్రయోగం వెనకాల ఉన్న కీలక శాస్త్రవేత్తలు
చంద్రుడిని అన్వేషించడానికి చంద్రయాన్-3 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా లాంచ్ చేసింది. నింగిలోకి దూసుకెళ్ళిన్ చంద్రయాన్-3 రాకెట్, మూడు దశలు దాటుకుని భూ కక్ష్యలోకి ప్రవేశించింది. మరో 40రోజుల్లో జాబిల్లి మీద చంద్రయాన్-3 ల్యాండ్ కానుంది. దేశ చరిత్రలో గొప్ప అధ్యాయంగా నిలిచిపోయే ఈ ప్రయోగం వెనకాల ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఒక్కసారి వారెవరో తెలుసుకుందాం. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్: చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో సోమనాథ్ పేరు చెప్పుకోవాల్సిందే. ఇస్రో ఛైర్మన్ అవకముందు రాకెట్ టెక్నాలజీని మెరుగుపరిచే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ పొపుల్సన్ లిక్విడ్ సెంటర్ కు డైరెక్టర్ గా సోమనాథ్ ఉన్నారు. ఇస్రో ఛైర్మన్ గా సోమనాథ్ వచ్చిన తర్వాతే చంద్రయాన్ ప్రయోగంలో వేగం వచ్చింది.
రాకెట్ ని డెవలప్ చేసిన శాస్త్రవేత్త
పి వీరముత్తువేల్- చంద్రయాన్ 3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్: మద్రాసులో ఐఐటీ చేసిన వీరముత్తువేల్, ఇస్రోలో సీనియర్ సైంటిస్టుగా కొనసాగుతున్నారు. అంతరిక్ష సంస్థల్లో 30ఏళ్ల అనుభవం ఉన్న వీరముత్తు వేల్, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా 2019లో నియమితులయ్యారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎమ్ వనిత స్థానంలో వీరముత్తువేల్ వచ్చారు. VSSC డైరెక్టర్ ఉన్నిక్రిష్ణన్ నాయర్- రాకెట్ ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త చంద్రయాన్-3 మిషన్ ని మోసుకెళ్ళే రాకెట్, LVM3 ని అభివృద్ధి చేయడంలో ఉన్నిక్రిష్ణన్ కీలక పాత్ర పోషించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఉన్నిక్రిష్ణన్, రాకెట్ ని అభివృద్ధి చేసారు.
చంద్రయాన్-3 ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తలు
మోహన్ కుమార్ - చంద్రయాన్ 3 మిషన్ డైరెక్టర్: అంతరిక్ష ప్రయోగం అనేది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఎంతోమంది మెదళ్ళు సాయం చేయాలి. వీరముత్తువేల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినప్పటికీ మిషన్ డైరెక్టర్ మోహన్ కుమార్, వెహికిల్ డైరెక్టర్ బిజు సి థామస్ ఎంతగానో పనిచేసారు. VSSC లో ఫ్యాబ్రికేషన్ ఆఫ్ కంపోసైట్స్ నాయకుడిగా మోహన్ కుమార్ పనిచేస్తున్నారు. ఇస్రోలో ఇంజనీర్ గా థామస్ పనిచేస్తున్నారు. చంద్రయాన్-3 కోసం పనిచేసిన 54మంది మహిళలు ఈ ప్రయోగం కోసం డెప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, ప్రాజెక్ట్ మేనేజర్లుగా ఇంకా ఇతర విభాగాల్లో మొత్తం 54మంది మహిళలు చంద్రయాన్-3 మిషన్ కోసం పనిచేసారు.