Page Loader
ISRO: ఇస్రో PSLV-C59 ప్రోబా-3 మిషన్‌ కౌంట్ డౌన్ ప్రక్రియ షురూ.. ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలంటే..!!
ఇస్రో PSLV-C59 ప్రోబా-3 మిషన్‌ కౌంట్ డౌన్ ప్రక్రియ షురూ..

ISRO: ఇస్రో PSLV-C59 ప్రోబా-3 మిషన్‌ కౌంట్ డౌన్ ప్రక్రియ షురూ.. ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలంటే..!!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2024
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ప్రయోగంలో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈస్ఏ),భారతదేశంలోని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) సంస్థ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిలో భాగంగా, డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం, ఇస్రో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ద్వారా ప్రోబా-3 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. తిరుపతి జిల్లా లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి, డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నాలుగు గంటలు 8 నిమిషాలకు ఈ ప్రయోగం మొదలవుతుంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భూమి నుండి 60,000 కిలోమీటర్ల ఎత్తులో, భూ ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్న కక్షలో ప్రోబా-3 ఉపగ్రహాన్ని పంపనున్నది.

వివరాలు 

ఓకల్టర్ సాటిలైట్, కరోనా గ్రాఫ్ సాటిలైట్

ఈ ప్రయోగానికి సంబంధించి, కౌంట్ డౌన్ ప్రక్రియ డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2:38 గంటలకు ప్రారంభమవుతుంది. మొత్తం 25 గంటల 30 నిమిషాల తర్వాత, డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 4:08 గంటలకు పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ద్వారా ప్రోబా-3 ఉపగ్రహం ఆకాశంలో ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రయోగం ద్వారా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రెండు ఉపగ్రహాలను కూడా పంపించనున్నారు. ఒకటి ఓకల్టర్ సాటిలైట్, రెండవది కరోనా గ్రాఫ్ సాటిలైట్. ఈ ఉపగ్రహాలు, 30,000 కిలోమీటర్ల నుంచి 60,000 కిలోమీటర్ల ఎత్తులోనూ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉన్న కక్షలోకి ప్రవేశించనున్నాయి.

వివరాలు 

ఇస్రోకి మరిన్ని అవకాశాలు 

ఈ ప్రయోగం పూర్తిగా విదేశీ కమర్షియల్ ప్రయోగంగా నిర్వహించబడుతుంది. ప్రోబా-3 ఉపగ్రహం, సూర్యుని బాహ్య వలయాన్ని, అలాగే కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ ప్రయోగం ఇస్రోకు ఒక సవాలుగా ఉంటుంది, అయితే విజయవంతమైన తర్వాత, ఇస్రోకి మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన రాకెట్ల ద్వారా ప్రయోగించే అవకాశాలు పెరిగిపోతాయి. ఈ ప్రయోగం కోసం షార్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.