చంద్రయాన్-3 క్లిక్ చేసిన భూమి, చంద్రుడి ఫోటోలు ఇవే: షేర్ చేసిన ఇస్రో
చంద్రుడి మీదకు చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. నిన్నటికి నిన్న కక్ష్య కుదింపు చర్యను చేపట్టి చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3 చేరుకునేలా ఇస్రో శాస్త్రవేత్తలు చేసారు. తాజాగా చంద్రయాన్-3 క్లిక్ చేసిన రెండు ఫోటోలను ఇస్రో పంచుకుంది. అందులో ఒకటి లాంచింగ్ రోజున భూమి ఫోటో, మరొకటి చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్న తర్వాత తీసిన చంద్రుడి ఫోటో. ఈ రెండు ఫోటోలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అదలా ఉంచితే, చంద్రయాన్-3 ప్రయోగానికి మరో రెండుసార్లు ఆగస్టు 14, 17తేదీల్లో కక్ష్య కుదింపు చర్యలు ఉంటాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేసారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండ్ అవుతుంది.