Page Loader
చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించిన జపాన్.. వచ్చే ఏడాది జాబిల్లిపైకి చేరే అవకాశం
చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించిన జపాన్.. వచ్చే ఏడాది జాబిల్లిపైకి చేరే అవకాశం

చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించిన జపాన్.. వచ్చే ఏడాది జాబిల్లిపైకి చేరే అవకాశం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 07, 2023
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్‌ SLIMను ఆ దేశ అంతరిక్ష సంస్థ గురువారం ప్రయోగించింది. ఈ మేరకు హెచ్ 2-ఏ రాకెట్ జపాన్ మూన్ ల్యాండర్ ను ఉదయం 8:42 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ మూన్ స్నిపర్ ల్యాండర్‌ను జాబిల్లిపైకి మోసుకెళ్లింది. ఈ నేపథ్యంలో జపాన్ తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్‌ను చేపట్టినట్టైంది. వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఈ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతికూల వాతావరణం కారణంగా 3 సార్లు రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 7న ఎట్టకేలకు జపాన్ రాకెట్ ప్రయోగించడం గమనార్హం.

details

నిర్దిష్ట లక్ష్యానికి 100 మీటర్ల లోపల ల్యాండ్ కానున్న జపాన్ మూన్ ల్యాండర్

మరోవైపు జపాన్ మూన్ ల్యాండింగ్ ప్రాజెక్టును దక్షిణ జపాన్‌లోని తనేగాషిమా నుంచి లిఫ్ట్ అయ్యింది.సుమారు 35 వేల మంది జపానీయులు ఆన్‌లైన్‌లో వీక్షించారు. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా), నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల పరిశోధన ఉపగ్రహాన్నీ స్లిమ్ రాకెట్ మోసుకెళ్లింది. జపాన్ కాంపాక్ట్ ల్యాండర్ ను అధికారికంగా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ గా పిలుస్తారు. ఈ ల్యాండర్ జాబిల్లిపై నిర్దిష్ట లక్ష్యానికి 100 మీటర్ల లోపల ల్యాండ్ అవుతుంది. జపాన్ గతంలో చేపట్టిన ప్రాజెక్టులు విఫలమయ్యాయి. కాగా గతేడాది యూఎస్ ఆర్టెమిస్ లో భాగంగా జపాన్ ఓమోటేనాషి రాకెట్ ను చందమామపైకి పంపింది.