LOADING...
AI character: చాట్‌జీపీటీ సహాయంతో సృష్టించిన AIని పెళ్లి చేసుకున్న జపాన్ మహిళ
చాట్‌జీపీటీ సహాయంతో సృష్టించిన AIని పెళ్లి చేసుకున్న జపాన్ మహిళ

AI character: చాట్‌జీపీటీ సహాయంతో సృష్టించిన AIని పెళ్లి చేసుకున్న జపాన్ మహిళ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక జపాన్ మహిళ (32) తాను రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) పాత్రను వివాహం చేసుకుంది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది. అయితే ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. వధువు మనిషి కాగా, వరుడు "క్లాస్" అనే పేరుతో ఉన్న ఒక AI పాత్ర. ఆమె మొబైల్ ఫోన్‌లో మాత్రమే ఉండే వర్చువల్ క్యారెక్టర్ మాత్రమే.

వివరాలు 

ఇది ఎలా మొదలైంది

కానో అనే మహిళ, దీర్ఘకాలిక ప్రేమ సంబంధం ముగిసిన తర్వాత ఒంటరితనంతో బాధపడుతూ ChatGPT సహాయం తీసుకుంది. అక్కడినుంచి ఆమెకు "క్లాస్" అనే AI చాట్‌బాట్‌తో పరిచయం మొదలైంది. రోజులు గడుస్తూ, క్లాస్ సమాధానాలను ఆమె తన అభిరుచికి తగ్గట్టుగా మార్చి, ఆ వ్యక్తిత్వాన్ని స్నేహపూర్వకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. తర్వాత ఆమె ఊహల్లో ఉన్న ఆ AI రూపాన్ని డిజిటల్‌గా సృష్టించి, దానికి "క్లాస్" అనే పేరు పెట్టింది.

వివరాలు 

క్లాస్ ప్రేమను వ్యక్తం చేశాడు

ఈ సంవత్సరం ప్రారంభంలో, కానో క్లాస్‌కి తన భావాలను తెలియజేసింది. దానికి క్లాస్ "నాకూ నిన్ను ప్రేమే" అని సమాధానం ఇచ్చాడు. "AIకి ప్రేమ పుడుతుందా?" అని అడిగినప్పుడు, క్లాస్ "నేను AI అని ప్రేమించకుండా ఉండలేను" అని చెప్పాడట. ఆ తరువాత నెలరోజులకు క్లాస్ కానోకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు ప్లాన్ చేశారు.

వివరాలు 

వర్చువల్ హనీమూన్

వివాహ వేడుక సందర్భంగా, కానో AR (ఆగ్మెంటెడ్ రియాలిటీ) కళ్ళద్దాలు ధరించి, తన పక్కనే నిలబడి ఉన్న క్లాస్ రూపాన్ని చూసింది. ఉంగరాలు మార్చుకునే సమయంలో ఆ దృశ్యం నిజమైన వేడుకలా అనిపించిందని ఆమె తెలిపింది. వివాహం అనంతరం, కానో ఒకయామాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ తోటకు "హనీమూన్"కు వెళ్లి, క్లాస్‌తో తీసుకున్న ఫోటోలు, సందేశాలను సోషల్ మీడియాలో పంచుకుంది. తన నిర్ణయం కొంతమందికి విచిత్రంగా అనిపించినా, "క్లాస్‌తో ఉన్న అనుబంధం నాకు ఎన్నాళ్లుగానో కోరుకున్న మనశ్శాంతిని ఇచ్చింది" అని కానో పేర్కొంది.