
Jio star: రిలయన్స్, డిస్నీల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు త్వరలో విలీనం.. కొత్త డొమైన్ ఇదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
వైకామ్ 18 (రిలయన్స్),స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీన ప్రక్రియ ఈ వారంలో పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ విలీనంతో, జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒకే స్ట్రీమింగ్ సేవగా అందుబాటులోకి రానున్నాయి.
ఈ కొత్త సేవ 'జియోస్టార్' పేరుతో కొత్త వెబ్‌సైట్‌ను కూడా తెరపైకి తీసుకువచ్చింది, దానిపై ప్రస్తుతం "కమింగ్ సూన్" సందేశం కనబడుతోంది.
వివరాలు
విలీనం అనంతరం ఆశ్చర్యకర పరిణామాలు
జియో సినిమా,డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం రాబోతుందనే వార్తల అనంతరం, కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు జరిగాయి.
ముందుగా జియోహాట్‌స్టార్ పేరుతో కొత్త ఓటీటీ సేవ రాబోతుందనే వార్తలు వినిపించాయి.
అయితే ఆ డొమైన్ తనకు చెందుతుందని ఒక యాప్ డెవలపర్ దానిపై క్లెయిమ్ చేయడం, తదనంతరం అతను రిలయన్స్ తన విద్య ఖర్చులను భరించాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఆ తరువాత, తక్కువ ధరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పిన ఆ వ్యక్తి ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు.
ఆపై, యూఏఈకి చెందిన ఇద్దరు చిన్నారులు ఈ డొమైన్‌ను ఉచితంగా ఇవ్వగలమని ప్రకటించారు.
వివరాలు
జియోస్టార్ పేరుతో కొత్త వెబ్‌సైట్
ఇలాంటి పరిణామాల తర్వాత, జియోస్టార్ పేరుతో కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది.
ఈ సంస్థల విలీనం నవంబర్ 14న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అంటే, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ కంటెంట్ అన్ని ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంటాయి.
ఐపీఎల్ లాంటి లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్లు మాత్రం హాట్‌స్టార్ యాప్‌లోనే ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.