తదుపరి వార్తా కథనం

Jio: జియో వినియోగదారులకు శుభవార్త.. 100 GB ఉచిత క్లౌడ్ స్టోరేజీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 29, 2024
03:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
జియో యూజర్లకు రిలయన్స్ నుంచి శుభవార్త వచ్చింది. ఈ దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ సేవలను ప్రారంభించనుంది.
ఇంకా, వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా జియో యూజర్లకు 100జీబీ ఉచిత స్టోరేజ్‌ను అందించనుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఈ కీలక ప్రకటనను కంపెనీ ఏజీఎంలో తెలిపారు.
గురువారం రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా దాదాపు 35 లక్షల మంది వాటాదారులను ఉద్దేశించి ఛైర్మన్ ముకేష్ అంబానీ ప్రసంగించారు.
కృత్రిమ మేధ(AI)ఆధారంగా తమ యూజర్ల కోసం కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్'జియో బ్రెయిన్' (Jio Brain)ను తీసుకురానున్నట్లు వెల్లడించారు.
తక్కువ ధరకే ఈ ఏఐ మోడల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కూడా తెలియజేశారు.