Page Loader
JioHotstar: రిలయన్స్‌, డిస్నీలకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విలీనం.. 'జియోహాట్‌స్టార్‌' పేరుతో నేటినుంచి సంయుక్త సేవలు 
రిలయన్స్‌, డిస్నీలకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విలీనం.. 'జియోహాట్‌స్టార్‌' పేరుతో నేటినుంచి సంయుక్త సేవలు

JioHotstar: రిలయన్స్‌, డిస్నీలకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విలీనం.. 'జియోహాట్‌స్టార్‌' పేరుతో నేటినుంచి సంయుక్త సేవలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య విలీన ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు సంస్థలు కలిసి 'జియోస్టార్' అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. తాజాగా, వీటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన జియో సినిమా, డిస్నీ+ హాట్‌ స్టార్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడంతో, 'జియోహాట్‌స్టార్‌ (JioHotstar)' పేరుతో కొత్తగా ఈ సేవలను ప్రారంభించారు. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను రూ.149 నుండి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేసింది.

వివరాలు 

ప్రేక్షకులకు మెరుగైన వినోదం 

కంపెనీ ప్రకటన ప్రకారం, 'జియోహాట్‌స్టార్‌' ద్వారా 3 లక్షల గంటల వినోద కంటెంట్, లైవ్ స్పోర్ట్స్ కవరేజ్ అందించనున్నారు. 50 కోట్లకు పైగా వినియోగదారులతో ఈ ప్లాట్‌ఫామ్ మరింత విస్తరించనుంది. ఇప్పటికే ఉన్న జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ యూజర్లు తమ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించుకోవచ్చు. అలాగే, కొత్తగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

వివరాలు 

డొమైన్ వివాదానికి ముగింపు 

జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం గురించి వార్తలు వెలువడినప్పటి నుండి అనేక చర్చలు జరిగాయి. ముఖ్యంగా, 'జియోహాట్‌స్టార్‌' పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాబోతుందన్న వార్తలతో పాటు, ఒక యాప్ డెవలపర్ ఈ డొమైన్ తనదేనని ప్రకటించడం, దాన్ని రిలయన్స్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. అనంతరం, యూఏఈకి చెందిన ఇద్దరు చిన్నారులు ఈ డొమైన్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించడంతో వివాదానికి తెరపడింది. ఈ పరిణామాల అనంతరం, వయాకామ్ 18, స్టార్ ఇండియా కలిసి 'జియోస్టార్' జాయింట్ వెంచర్‌ను స్థాపించాయి. ఈ కిందే, కొత్తగా 'జియోహాట్‌స్టార్‌' ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఇకపై జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లోని మొత్తం కంటెంట్ ఒకేచోట లభించనుంది.