Page Loader
Jio Finance: జియో ఫైనాన్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసిన రిలయన్స్‌ 
జియో ఫైనాన్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసిన రిలయన్స్‌

Jio Finance: జియో ఫైనాన్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసిన రిలయన్స్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్‌కు చెందిన ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services) బీమా రంగంలో ప్రవేశించింది. 'జియో ఫైనాన్స్‌' పేరిట కొత్త యాప్‌ను ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌, ఆపిల్ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మై జియో యాప్‌లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌) డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు 'జియో ఫైనాన్స్‌' బీటా/పైలట్ వెర్షన్ యాప్‌ను మే 30న ప్రయోగాత్మకంగా లాంచ్ చేశారు. వినియోగదారుల నుంచి వచ్చిన సూచనలు,సలహాల ఆధారంగా ఇప్పుడు పూర్తి స్థాయి యాప్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్టాక్ ఎక్స్చేంజ్‌కి సమర్పించిన నివేదికలో వెల్లడించారు.

వివరాలు 

24 రకాల బీమా ప్లాన్‌లు

కేవలం 5 నిమిషాల్లో డిజిట్ సేవింగ్ ఖాతా తెరవచ్చని, బయోమెట్రిక్, ఫిజికల్ డెబిట్ కార్డ్ ద్వారా సురక్షిత బ్యాంకు ఖాతా కలిగి ఉండవచ్చని వివరించారు. ఈ యాప్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, బిల్లుల చెల్లింపు, బీమా సలహాదారు వంటి సేవలు పొందవచ్చని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. మొబైల్ రీచార్జ్, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపు సదుపాయం కూడా యాప్‌లో అందుబాటులో ఉంది. వినియోగదారులు వివిధ బ్యాంకు ఖాతాల్లోని హోల్డింగ్స్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు కూడా చూడవచ్చు. అదనంగా 24 రకాల బీమా ప్లాన్‌లను అందిస్తున్నారు.

వివరాలు 

జీరో ప్లాట్‌ఫామ్ ఫీ

జియో యాప్‌లోని డేటా ప్రకారం, మొబైల్ రీచార్జీలపై ఇతర యూపీఐ ప్లాట్‌ఫామ్‌లు ఫ్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. కానీ, జియో ఫైనాన్స్ యాప్‌ ద్వారా రీచార్జ్‌లపై ఎటువంటి ఫీజు ఉండదని కంపెనీ తెలిపింది. యూపీఐ లావాదేవీలపై ఆకర్షణీయమైన రివార్డు పాయింట్లు కూడా ఇవ్వబడతాయి. వినియోగదారులు మ్యూచువల్ ఫండ్లపై రుణం తీసుకోవచ్చు, చాట్ ద్వారా సులభంగా లోన్ అప్రూవల్ పొందవచ్చు. జియో ఫైనాన్స్‌ అందించే సేవలను ఏ సిమ్‌కార్డ్ సాయంతోనైనా పొందవచ్చని కూడా వివరించారు.