Page Loader
రిలీజ్‌కు ముందే జియోఫోన్ 5జీ ఫోటోలు లీక్.. ఫీచర్స్ ఇవే!
జియో ఫోన్ 5జీ

రిలీజ్‌కు ముందే జియోఫోన్ 5జీ ఫోటోలు లీక్.. ఫీచర్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ కు చెందిన జియో ఫోన్ 5జీకి సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వినపడుతున్నాయి. గూగుల్‌తో కలిసి ఓ 5జీ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు ఇదివరకే జియో స్పష్టం చేసింది. కానీ విడుదల తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది దీపావళికి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో జియో ఫోన్ 5జీ ఫోన్ ఫోటోలు ఇవేనంటూ టిప్‌స్టర్ కొన్ని ఫోటోలను లీక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. జియో ఫోన్ 5జీకి సంబంధించి కొన్ని ఫోటోలను అర్పిత్ పటేల్ ట్విటర్ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అదే విధంగా ఫోన్‌కు సంబంధించి కొన్ని వివరాలు అందులో ఉన్నాయి.

Details

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ముందుకు రానున్న జియో ఫోన్

జియో ఫోన్ వెనక వైపు 13ఎంపీ+ 2 ఎంపీ కెమెరా అమర్చారు. ముందు వైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు షేర్ చేసిన ఫోటోల్లో ఓ వైపు 5జీ స్పీడ్ కూడా దర్శనమిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.8 నుంచి 12వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో ఈ ఫోన్‌ ముందుకొచ్చింది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 18 W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేయనుంది. సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రో SD కార్డ్ స్లాట్, డ్యూయల్ సిమ్ స్లాట్ ఇందులో ఉండనున్నాయి.