JUICE Mission: బృహస్పతిపై మానవ ఆనవాళ్లను గుర్తించేందుకు జ్యూస్ మిషన్; రేపు ప్రయోగం
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) గురువారం తన అతిపెద్ద ప్రయోగాలలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన బృహస్పతి ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (Juice) మిషన్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది. సౌర వ్యవస్థలోనే అతి పెద్ద గ్రహమైన బృహస్పతిపై ఈ మిషన్‌ను ప్రయోగించనున్నారు. భూమికి మించిన జీవరాశుల సంకేతాలను గుర్తించడానికి బృహస్పతితో పాటు దాని చుట్టూతో మంచుతో చంద్రులను అన్వేషించడమే లక్ష్యంగా ఈఎస్ఏ ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన జ్యూస్ మిషన్‌ను భూమికి మించి మోసుకెళ్లడానికి అత్యంత శక్తివంతమైన రాకెట్ 'ఏరియన్ 5'ని ఇప్పటకే సిద్ధం చేశారు.
అంతరిక్షంలో 8ఏళ్లు ప్రయాణించనున్న 'ఏరియన్ 5' రాకెట్
దాదాపు ఎనిమిదేళ్ల పాటు అంతరిక్ష నౌక 'ఏరియన్ 5' ప్రయాణించనుంది. 2031లో చంద్రులు, గ్రహాల గుండా ప్రయాణించి, చివరకు బృహస్పతిని చేరుకుంటుందని ఈఎస్ఏ తెలిపింది. ఈ వ్యోమనౌక బృహస్పతి సంక్లిష్ట వాతావరణాన్ని లోతుగా అన్వేషిస్తుంది. విశ్వంలోని గ్యాస్ జెయింట్‌ల కోసం ఒక ఆర్కిటైప్‌గా విస్తృత బృహస్పతి వ్యవస్థను అధ్యయనం చేస్తుంది. ఈ వ్యోమనౌక ఏప్రిల్ 13న ఫ్రెంచ్ గయానాలోని యూరప్‌లోని స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించనున్నారు. ఇది ప్రయోగించిన 30 నిమిషాల తర్వాత అంతరిక్ష నౌక విడిపోతుంది. సౌర వ్యవస్థలో జీవం అనవాళ్లు ఉన్న ఏకైక గ్రహం భూమి. అయితే సౌర వ్యవస్థలో ఇలాంటి గ్రహాలు ఉన్నాయా? మానవ ఆనవాళ్లను గనుగొనేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని ఈఎస్ఏ పేర్కొంది.