అరుదైన కలయికలో కలిసి కనిపించనున్న బృహస్పతి, శుక్ర గ్రహాలు
చంద్రుడు, శుక్రుడు, బృహస్పతి కలిసి కనిపించిన కొన్ని రోజుల తర్వాత, సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం అయిన బృహస్పతి, భూమికి దగ్గరగా ఉండే శుక్ర గ్రహం మార్చి 1న ఆకాశంలో అరుదైన కలయికతో కనిపించనున్నాయి. రెండు గ్రహాలు భూమిపై రాత్రి సమయంలో దగ్గరగా కనిపిస్తాయి. రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా రెండు గ్రహాలను తక్కువ కాంతి కాలుష్యంతో గుర్తించచ్చు. రెండు గ్రహాలు ఫిబ్రవరి 21, 22 సాయంత్రం చంద్రునితో ఒక ట్రిఫెక్టాను ఏర్పరిచాయి. రెండు గ్రహాలు ఆకాశంలో మామూలుగా చూస్తే కేవలం 0.5 డిగ్రీలతో వేరుగా ఉన్నటు ఉంటాయి. వాస్తవానికి అంతరిక్ష శూన్యంలో మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉంటాయి. సూర్యుని చుట్టూ ఉన్న కక్ష్యలలో వాటి స్థానం కారణంగా రెండూ దగ్గరగా కనిపిస్తాయి
శుక్రుడు సూర్య, చంద్రుల తర్వాత ఆకాశంలో 3వ ప్రకాశవంతమైన నక్షత్రం
ఫిబ్రవరి ప్రారంభంలో, రెండు గ్రహాలు 29 డిగ్రీల దూరం ఉంటే, ఇది నెలాఖరు నాటికి 2.3 డిగ్రీలకు తగ్గింది. మార్చి 1 న బృహస్పతి -2.1 పరిమాణంతో ప్రకాశవంతంగా ఉంటుందని అంచనా వేశారు, ఇది ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ కంటే రెండింతలు ప్రకాశవంతంగా ఉంటుంది. శుక్రుడు సూర్య, చంద్రుల తర్వాత ఆకాశంలో 3వ ప్రకాశవంతమైన నక్షత్రం. ఇది చాలా మిరుమిట్లు గొలిపే విధంగా ఉంటుంది, కొన్నిసార్లు పగటిపూట కూడా గుర్తించవచ్చు. ఇది భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం అయినా ప్రతిబింబించే మేఘాలతో ఉండటం శుక్రుడి మేఘాలు సూర్యరశ్మిని ప్రతిబింబించడంలో మంచివి కావడం వల్ల ప్రకాశం ఏర్పడింది.