అరుదైన కలయికలో కనిపించనున్న బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు
ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత అరుదైన ఖగోళ సంఘటన జరగనుంది. భూమి నుండి కనిపించే ప్రకాశవంతమైన గ్రహాలు బృహస్పతి, శుక్రుడు ఫిబ్రవరిలో ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఈరోజు ఆ సీన్‌లో చంద్రుడు కూడా చేరనున్నాడు. వాతావరణం అనుకూలిస్తే, సాయంత్రం ఆకాశంలో ఈ అద్భుతమైన సంఘటనను చూడచ్చు. అరుదైన ఆకుపచ్చ తోకచుక్క ఇప్పుడే భూమిని దాటుతుంది. ప్రపంచవ్యాప్తంగా కనిపించే అరుదైన ఖగోళ విన్యాసంలో శుక్రుడు, బృహస్పతి, చంద్రుడు కలిసి కనిపించనున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో, బృహస్పతి, శుక్రుడు 29 డిగ్రీలతో వేరు అయ్యారు, ఫిబ్రవరి చివరి నాటికి 2.3 డిగ్రీలకు తగ్గుతారు. సూర్యాస్తమయం తర్వాత, బృహస్పతి, శుక్రు గ్రహాలు పశ్చిమ ఆకాశంలో కనిపిస్తాయి, వాటితో పాటు చంద్రవంకను చూడగలరు.
ఈ ఖగోళ సంఘటన ఫిబ్రవరి 21,22 సాయంత్రం కూడా కనిపిస్తుంది
చంద్రవంక కేవలం నాలుగు శాతం ప్రకాశవంతంగా ఉంటుంది, శుక్రుడి కంటే 7 డిగ్రీల దిగువన కనిపిస్తుంది. బృహస్పతి శుక్రుడు, చంద్రుని పైన కనిపిస్తాయి, దాదాపు ఎనిమిది డిగ్రీలు వేరుగా ఉంటాయి. ఇది ఫిబ్రవరి 22న కూడా కనిపిస్తుంది. Earthsky.org ప్రకారం, ఈ ఖగోళ సంఘటన ఫిబ్రవరి 21,22 సాయంత్రం కూడా కనిపిస్తుంది. ఫిబ్రవరి 22న, చంద్రుడు బృహస్పతికి ఒక డిగ్రీ దూరంలో ఉంటాడు, మధ్యలో శుక్రుడు ఉంటాడు. చంద్రుడు దూరంగా వెళ్ళినప్పుడు, శుక్రుడు, బృహస్పతి ఒకదానికొకటి దగ్గరగా వస్తూనే ఉంటాయి. ఫిబ్రవరి 27న చంద్రుడు మరో గ్రహం అంగారకుడితో జతకట్టనున్నాడు. ఫిబ్రవరి 27 న సూర్యాస్తమయం తర్వాత నైరుతి దిశలో చూస్తే, చంద్రుడు, అంగారకుడిని గుర్తించగలుగుతారు