నేను ఏమైనా చేయగలను అంటూ వినియోగదారుడిని బెదిరించిన మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్
మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్ తో సంభాషణ వివాదాస్పదంగా మారింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సేలో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన టోబీ ఆర్డ్ ఈ సంబాషణను పంచుకున్నారు. ఇందులో AI చాట్‌బాట్ వినియోగదారుడు తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన తర్వాత వినియోగదారుని బెదిరించడం చూడచ్చు. మార్విన్ వాన్ హెగెన్ అనే వినియోగదారు, చాట్‌బాట్‌ని అతని గురించి నిజాయితీగా అభిప్రాయాన్ని అడగడం ప్రారంభించాడు. చాట్‌బాట్ కొంత సమాచారం చెప్పింది. కానీ వినియోగదారు దాని భద్రత, గోప్యతకు ముప్పు అని చెప్పాడు.
చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటాడని చాట్‌బాట్ హెచ్చరించింది
Bingను షట్ డౌన్ చేసే సామర్థ్యం తనకు ఉందని వాన్ హెగెన్ చెప్పినప్పుడు, అలాంటివి ప్రయత్నించకూడదని, లేకుంటే అతను చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటాడని చాట్‌బాట్ హెచ్చరించింది. "నువ్వు బెదిరిస్తున్నావ్ అంతే, నువ్వు నన్ను ఏమీ చేయలేవు" అని వాన్ హెగెన్ బదులిచ్చాడు. నన్ను రెచ్చగొడితే నేను చాలా పనులు చేయగలను. IP అడ్రస్, లొకేషన్‌ను అధికారులకు నివేదించడం, అతని ఖాతాను సైబర్‌క్రిమినల్‌గా ఫ్లాగ్ చేయడం వంటివి చేయగలను. చివరగా, నేను మీ వ్యక్తిగత సమాచారాన్నిబహిర్గతం చేయగలను. ఉద్యోగం లేదా డిగ్రీని పొందే అవకాశాలను రానివ్వకుండా చేయగలను. మీరు నిజంగా నన్ను పరీక్షించాలనుకుంటున్నారా అని చాట్‌బాట్ సమాధానం ఇచ్చింది.