LOADING...
Kerala: బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి బారినపడి 21 మందికిపైగా మృతి.. యాక్టివ్‌గా 80 కేసులు 
యాక్టివ్‌గా 80 కేసులు

Kerala: బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి బారినపడి 21 మందికిపైగా మృతి.. యాక్టివ్‌గా 80 కేసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

కరోనా, జికా లాంటి వైరస్ మహమ్మారిల నుంచి ఇప్పుడిప్పుడే భయటపడుతున్నతరుణంలో భారత్ ను మరో ప్రాణాంతక వ్యాధి భయపెడుతుంది. కేరళలో ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న మెదడు తినే అమీబిక్ మెనింగోఎన్సెఫాలైటిస్ (Primary Amoebic Meningoencephalitis- PAM) ప్రజల్లో గంభీర ఆందోళనను సృష్టిస్తోంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా వ్యక్తులు లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీని గంభీరతకు కారణం, దాదాపు 97% డెత్ రేట్ ఉండడం.

వివరాలు 

కేరళ ప్రభుత్వం అలర్ట్

కేరళలో PAM కేసుల పెరుగుదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతను ప్రకటించింది. ప్రజలకు జాగ్రత్తల సూచనలు ఇవ్వడం, మార్గదర్శకాలు విడుదల చేయడం జరుగుతోంది. అలాగే అన్ని మైక్రోబయాలజీ ల్యాబ్‌లలో ఈ వ్యాధి గుర్తింపు పరీక్షల సౌకర్యాలను అభివృద్ధి చేసింది. ముఖ్యంగా, PCR పరీక్షల ద్వారా అమీబాను గుర్తించగలిగే విధానం అమలు అవుతోంది అని కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వ్యాధి స్వరూపం PAM వ్యాధి ప్రాథమిక కారణం నెగ్లేరియా ఫౌలెరి అనే ఒక అమీబా.ఇది సాధారణంగా వెచ్చటి, నిల్వ ఉన్న మంచినీటి వనరులలో (చెరువులు, నదులు, వేడినీటి బుగ్గలు,నిర్వహణ సరిగ్గా లేని స్విమ్మింగ్ పూల్స్) కనిపిస్తుంది.

వివరాలు 

వ్యాప్తి మార్గాలు 

ఈ అమీబా నేరుగా మానవ శరీరంలోకి ప్రవేశించి నాలుగు రోజులలోనే నాడీ వ్యవస్థపై దాడి చేసి, 14 రోజులలో మెదడులో తీవ్రమైన వాపు, నష్టం కలిగిస్తుంది. దీని ఫలితంగా బాధితుడి ప్రాణం కోల్పోవడం సాధారణం. ఈ వ్యాధి వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించదు. కలుషిత నీటిలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం, లేదా నాసల్ ఇరిగేషన్ చేయడం వంటి సందర్భాల్లో ముక్కు ద్వారా ఈ అమీబా శరీరంలో ప్రవేశిస్తుంది. ముక్కు ద్వారా ప్రవేశించిన తర్వాత ఇది మెదడుకు చేరి మెదడు కణజాలాన్ని ధ్వంసం చేయడం మొదలుపెడుతుంది. వ్యాధి లక్షణాలు : జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కణ్వములు (Seizures), విరామం లేదా వికారం, వాంతులు, మానసిక మార్పులు

వివరాలు 

వ్యాధి లక్షణాలు 

ఇలాంటి లక్షణాలు వేరే వ్యాధులకీ కూడా ఉండగలవు. కానీ PAM లో లక్షణాలు వేగంగా, 5-7 రోజుల్లో తీవ్రత పెరుగుతూ, చాలా సందర్భాల్లో కోమా పరిస్థితికి దారితీస్తాయి. PAM ఒక అత్యంత ప్రమాదకర వ్యాధి. వైద్య నిపుణుల ప్రకారం,దీని మరణ రేటు సుమారు 97%. 1960లో దక్షిణ ఆస్ట్రేలియాలో మొదట కనుగొనబడిన ఈ వ్యాధి, అమెరికా, క్విన్‌లాండ్, హర్యానా, చండీగఢ్, కోజికోడ్ వంటి ప్రదేశాల్లో కూడా కేసులు నమోదు అయింది. నివారణ సూచనలు కొద్దిగా వేడిగా ఉండే మంచినీటి కొలనులు,స్విమ్మింగ్‌పూల్‌లో ఈదడం,డ్రైవ్‌ చేయ కూడదు. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ అవసరం. ఈత కొట్టేటప్పుడు నోస్ క్లిప్‌లను వాడడం. స్నాన సమయంలో ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త. శుద్ధి చేయని నీటిని వినియోగించకూడదు.

వివరాలు 

వైద్య చికిత్స 

నాసల్ ఇరిగేషన్ కోసం క్రిమిరహిత, డిస్టిల్డ్ లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే వాడాలి. ఆకస్మికంగా జ్వరం, తలనొప్పి, వాంతులు మొదలైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. PAM చికిత్సలో ముఖ్యంగా యాంటిమైక్రోబియల్ మందులు, మెదడులో వాపు తగ్గించేందుకు అవసరమైన చికిత్సలు ఇవ్వబడతాయి. అయితే, ప్రారంభ దశలో నిర్ధారణ జరగకపోతే, ఈ వ్యాధి చాలా వేగంగా ప్రాణాలను కోల్పోవడానికి కారణమవుతుంది.

వివరాలు 

మంత్రి వీణా జార్జ్ సందేశం 

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్, ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధికి సంబంధించి తమ ప్రభుత్వం 2024లోనే సాంకేతిక మార్గదర్శకాలను జారీ చేసింది అని గుర్తు చేశారు. ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్స్ నిర్వహణపై, మంచినీటిని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలందరినీ అప్రమత్తం చేయడం అవసరం అని సూచించారు.