LOADING...
AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2025
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు సంచలనాత్మక హెచ్చరిక జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పనులలో Chat GPT, Deep Seek వంటి ప్రసిద్ధ AI టూల్స్‌ను ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటువంటి సూచనలను సకాలంలో విడుదల చేసింది. ప్రభుత్వానికి చెందిన అధికారిక పరికరాలు, సిస్టమ్స్‌పై ఈ AI టూల్స్ వినియోగాన్ని పరిమితం చేయడం ద్వారా ఆంక్షలు విధించబడ్డాయి. ప్రధానంగా ఈ నిర్ణయం ప్రభుత్వ డేటా గోప్యత (డేటా ప్రైవసీ) సమాచార భద్రతను కాపాడడమే లక్ష్యంగా తీసుకున్నదని కేంద్రం తెలిపింది.

Details

ప్రభుత్వ డేటా భద్రతకు ముప్పు

నియంత్రణలేని విధంగా AI టూల్స్‌లో సున్నితమైన, వ్యక్తిగత లేదా రహస్య సమాచారాన్ని ఎంటర్ చేయడం ప్రభుత్వ డేటా భద్రతకు సీరియస్ ముప్పును కలిగించే అవకాశం ఉందని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా దేశానికి సంబంధించిన రహస్య సమాచారము అనధికారికంగా ఇతర దేశాలకు లేదా సంస్థలకు చేరే ప్రమాదం ఉండవచ్చని స్పష్టత ఇచ్చింది. కేంద్రం అందించిన మార్గదర్శకాలు ప్రకారం, ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు తమ అధికారిక విధులు నిర్వహించేటప్పుడు AI సేవలను అత్యంత జాగ్రత్తగా, నియమావళి, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ మాత్రమే ఉపయోగించాలని సూచించింది.

Details

సైబర్ ప్రమాదాలను నివారించవచ్చు

ఈ ఆదేశాల ఉద్దేశ్యం ప్రభుత్వ సమాచారాన్ని మరింత సురక్షితంగా కాపాడడమే. దేశ భద్రతకు సంబంధించిన సమాచారం రక్షణ బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని కూడా కేంద్రం గుర్తు చేసింది. ఇదే సమయంలో, సైబర్ నిపుణులు ప్రజలకు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు, బ్యాంక్ వివరాలు వంటి సున్నితమైన డేటాను AI టూల్స్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్‌లోడ్ చేయరాదని సలహా ఇచ్చారు. ఇలా చేయడం ద్వారా డేటా దుర్వినియోగం, సైబర్ ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేశారు.

Advertisement