Vivo V50: 50MP సెల్ఫీ కెమెరాతో లాంచ్.. అధునాతన ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీ!
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తన మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో Vivo V50 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
ప్రత్యేకంగా కెమెరా ప్రియులను టార్గెట్ చేస్తూ డ్యూయల్ 50MP కెమెరాతో దీన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
వెనుకవైపు 50MP డ్యూయల్ కెమెరా మాత్రమే కాకుండా ముందు వైపు కూడా 50MP సెల్ఫీ కెమెరా ఉండటం దీని ప్రత్యేకత.
సర్కిల్ టు సెర్చ్, ట్రాన్స్‌స్క్రిప్ట్ అసిస్ట్, లైవ్ కాల్ ట్రాన్సలేషన్ వంటి అధునాతన ఏఐ ఫీచర్లు ఈ ఫోన్‌కు అదనపు ఆకర్షణగా మారాయి
Details
Vivo V50 ప్రత్యేకతలివే
డిస్‌ప్లే: 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్
స్క్రీన్ రిఫ్రెష్ రేటు: 120Hz పీక్ బ్రైట్‌నెస్: 4500 నిట్స్
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7th Gen 3
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 (ఫన్‌టచ్ ఓఎస్ 15)
కెమెరా సెటప్: వెనుక: 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP అల్ట్రావైడ్ లెన్స్
ముందు: 50MP సెల్ఫీ కెమెరా
ఫోటో ఎడిటింగ్: AI ఆధారిత ఆరా లైట్, అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టూల్స్
బ్యాటరీ: 6000mAh
ఛార్జింగ్: 90W ఫాస్ట్ ఛార్జింగ్
సెక్యూరిటీ: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
జలనిరోధితత: IP68, IP69 రేటింగ్
Details
ఫ్రీ బుకింగ్స్ ప్రారంభం
8GB + 128GB - 34,999
8GB + 256GB - 36,999
12GB + 512GB - 40,999
ఈ ఫోన్ ఫిబ్రవరి 25న నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా ఇ-స్టోర్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.