
OnePlus Nord 5: 6800mAh బ్యాటరీ, 50MP డ్యూయెల్ కెమెరా, AI ఫీచర్స్‌తో మార్కెట్లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ 'వన్ ప్లస్ నార్డ్ 5' మార్కెట్లోకి విడుదలైంది. ఈ గ్యాడ్జెట్‌లో 6800mAh బడా బ్యాటరీ, 50MP+80MP డ్యూయెల్ రియర్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా, అలాగే సూపర్ AI ఫీచర్స్ ఉన్నాయి. డిస్ప్లే & ప్రొటెక్షన్ వన్ప్లస్ నార్డ్ 5లో 6.83-inch AMOLED డిస్ప్లే ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. పీక్ బ్రైట్‌నెస్ 1400 nits, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ కూడా అందించారు. కెమెరా ఫీచర్స్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MPఫ్రంట్ కెమెరా, 50MP+80MPడ్యూయెల్ రియర్ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. AI ఆధారిత ఫోటో, వీడియో ఫీచర్స్‌తో ఈ కెమెరా మరింత శక్తివంతంగా ఉంది.
Details
ప్రాసెసర్ & ర్యామ్/స్టోరేజ్
ఫోన్ Snapdragon 8S Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB-12GB RAM, 256GB-512GB స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. Android 15 ఆధారిత OxygenOS 15పై ఇది పనిచేస్తుంది. సంస్థ 4 సంవత్సరాల OS అప్డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ హామీ ఇస్తోంది. AI ఫీచర్స్ AI ప్లస్ మైండ్, ప్లస్ కీ, AI రైటర్, AI పర్ఫెక్ట్ షాట్, AI అన్‌బ్లర్, AI ఎరేజర్, AI సెర్చ్ వంటి బోలెడ్ AI ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మెమోరీ సేవింగ్, టెక్ట్స్ జనరేషన్, ఫోటో ఎడిటింగ్ కోసం ఈ AI ఫీచర్స్ ఉపయోగకరంగా ఉంటాయి. ధర&లభ్యత అమెజాన్‌లో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం ₹31,998గా ఉంది.