Page Loader
మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌
అమెజాన్ లో అందుబాటులో ఉన్న లావా Blaze 5G కొత్త వేరియంట్‌

మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 11, 2023
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశీ బ్రాండ్ లావా భారతదేశంలో తన Blaze 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM వేరియంట్‌ను విడుదల చేసింది. గతేడాది 4GB RAMతో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ 6.5-అంగుళాల LCD స్క్రీన్, డైమెన్సిటీ 700 చిప్‌సెట్, 128GB స్టోరేజ్ తో, 5,000mAh బ్యాటరీతో వస్తుంది. భారతదేశంలో తక్కువ-ధర స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో లావా ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. 15,000 సెగ్మెంట్ లో Xiaomi, సామ్ సంగ్ వంటి బ్రాండ్లతో పోటీపడుతుంది. లావా Blaze 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల HD+ (720x1600 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ ఉంది. ఇది గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఇందులో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

ఫోన్

ఈ ఫోన్ అమెజాన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది

Lava Blaze 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో స్నాపర్, VGA లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP షూటర్ ఉంది. ఇందులో 6GB RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది వర్చువల్ RAMతో వస్తుంది. 5,000mAh బ్యాటరీతో 10W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో బ్లూటూత్ 5.0, GPS, 3.5mm ఆడియో జాక్, 5G, Wi-Fi 5, టైప్-సి పోర్ట్ ఉన్నాయి. భారతదేశంలో, లావా Blaze 5G 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 11,499. ఈ ఫోన్ అమెజాన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది.