LOADING...
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సెర్చ్‌లా? వెంటనే పేరెంట్స్‌కు నోటిఫికేషన్‌!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సెర్చ్‌లా? వెంటనే పేరెంట్స్‌కు నోటిఫికేషన్‌!

Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సెర్చ్‌లా? వెంటనే పేరెంట్స్‌కు నోటిఫికేషన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్‌ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫారమ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల మానసిక పరిస్థితిని తల్లిదండ్రులు అర్థం చేసుకునేలా 'పేరెంటల్‌ నోటిఫికేషన్‌' అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ముఖ్యంగా ఆత్మహత్యలు లేదా స్వయం హింస (సెల్ఫ్‌-హార్మ్‌)కు దారితీసే కంటెంట్‌ను టీనేజర్లు వెతికే సందర్భాల్లో ఈ ఫీచర్‌ ముందస్తు హెచ్చరికలా పనిచేస్తుంది.

Details

నోటిఫికేషన్ ఎలా పనిచేస్తుంది?

ఇన్‌స్టాగ్రామ్‌లో 'పేరెంటల్‌ సూపర్‌విజన్‌' టూల్స్‌ను ఎనేబుల్‌ చేసుకున్న తల్లిదండ్రులకు మాత్రమే ఈ అలర్ట్‌లు అందుతాయి. ఒక టీనేజర్‌ తక్కువ వ్యవధిలో పదే పదే ఆత్మహత్య లేదా స్వయం హింసకు సంబంధించిన పదాలను సెర్చ్‌ చేస్తే, ఆ ట్రెండ్‌ను మెటా గుర్తిస్తుంది. వెంటనే తల్లిదండ్రులకు ఈమెయిల్‌, టెక్స్ట్‌ మెసేజ్‌, వాట్సాప్‌ లేదా ఇన్‌-యాప్‌ నోటిఫికేషన్‌ ద్వారా సమాచారం చేరుతుంది. ఎప్పుడు అందుబాటులోకి? ఈ ఫీచర్‌ వచ్చే వారం నుంచే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌, అమెరికా దేశాల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా విస్తరించనుంది.

Details

ముందస్తు భద్రతా చర్యలు

మెటా ఇప్పటికే కొన్ని రక్షణ చర్యలను అమలు చేస్తోంది. నేరుగా నిరోధం ఆత్మహత్యలకు సంబంధించిన ప్రమాదకర సెర్చ్‌లను బ్లాక్‌ చేస్తోంది. అలాంటి పదాలను వెతికిన యూజర్లకు హెల్ప్‌లైన్‌ నంబర్లు చూపిస్తోంది. నిపుణుల సలహాలు నోటిఫికేషన్‌ అందినప్పుడు తల్లిదండ్రులు ఎలా స్పందించాలి? పిల్లలతో ఎలా మాట్లాడాలి? వారికి ఎలా మద్దతు ఇవ్వాలి? వంటి అంశాలపై నిపుణుల మార్గదర్శకాలను కూడా అందిస్తుంది. ఏఐ ఆధారిత భద్రత కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ సెర్చ్‌లకే కాకుండా, మెటా ఏఐ చాట్‌బాట్‌తో టీనేజర్లు సున్నిత అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేసినా తల్లిదండ్రులకు అలర్ట్‌ వెళ్లేలా త్వరలో అప్‌డేట్‌ తీసుకురానుంది.

Advertisement

Details

తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

18 ఏళ్ల లోపు యూజర్లకు గత ఏడాది నుంచే మెటా కఠిన నియమాలను అమలు చేస్తోంది. '13+ సెట్టింగ్స్‌' కింద ప్రైవసీ సెట్టింగ్స్‌ మార్చాలన్నా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కొత్త నోటిఫికేషన్‌ ఫీచర్‌తో పిల్లల ఆన్‌లైన్‌ ప్రవర్తనపై తల్లిదండ్రులకు మరింత పట్టు లభిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇదిలా ఉండగా, పిల్లలు సోషల్‌ మీడియాను వినియోగించడాన్ని ఆస్ట్రేలియా ఇప్పటికే నిషేధించింది. మన దేశంలోనూ ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఇతర సోషల్‌ మీడియా యాప్‌లలో సేఫ్టీ ఫీచర్లను అప్‌డేట్‌ చేస్తున్నారు.

Advertisement

Details

తరచూ అడిగే ప్రశ్నలు

ప్రశ్న: నా పిల్లలు ఏ పదాలు సెర్చ్‌ చేశారో పూర్తి వివరాలు నాకు తెలుస్తాయా? సమాధానం: తల్లిదండ్రులకు వచ్చే అలర్ట్‌లో ఖచ్చితమైన పదాలు లేదా పూర్తి సెర్చ్‌ హిస్టరీ ఉండదు. భద్రతా కారణాల దృష్ట్యా, "ఆత్మహత్య లేదా స్వయం హింసకు సంబంధించిన పదాలను పదే పదే వెతుకుతున్నారనే సమాచారం మాత్రమే అందుతుంది. పిల్లల ప్రైవసీని కాపాడుతూనే, వారు ఇబ్బందుల్లో ఉన్నారని ముందస్తుగా తెలియజేయడమే దీని ఉద్దేశం. ప్రశ్న: ఒక్కసారి సెర్చ్‌ చేసినా నోటిఫికేషన్‌ వస్తుందా? సమాధానం: కాదు. కేవలం ఒకసారి లేదా పొరపాటున సెర్చ్‌ చేస్తే అలర్ట్‌ వెళ్లదు. తక్కువ సమయంలోనే పదే పదే ప్రమాదకర పదాలను వెతికే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ యాక్టివేట్‌ అవుతుంది.

Advertisement