Page Loader
Lunar Eclipse 2023 : ఈనెల 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయం ఇదే
Lunar Eclipse 2023 : ఈనెల 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయం ఇదే Lunar Eclipse 2023 : ఈనెల 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయం ఇదే

Lunar Eclipse 2023 : ఈనెల 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయం ఇదే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 25, 2023
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈనెల 28న చంద్రగ్రహణం సంభవించనుంది. అక్టోబర్ 28న రాత్రి, పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ మేరకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గ్రహణాన్ని వీక్షించవచ్చు. అక్టోబర్ 28న రాత్రి 11:31 ISTకి ప్రారంభమై అక్టోబర్ 29న తెల్లవారుజామున 3:36 గంటలకు ముగుస్తుంది. మే 5న సంభవించిన చంద్రగ్రహణం తర్వాత ఈ ఏడాది ఏర్పడనున్న రెండో చంద్రగ్రహణం శనివారం నాడు ఏర్పడనుంది. ఈ సందర్భంగా తెలంగాణలోని యాదాద్రి ఆలయంలో 28న సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నందింగల్ లక్ష్మీ నరసింహచార్యులు తెలిపారు. తిరిగి 29న వేకుజామున ఐదు గంటలకు తెరిచి సంప్రోక్షణ చేస్తామన్నారు.గ్రహణం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ఆలయం సహా అనుబంధ దేవాలయాలనూ మూసివేయనున్నారు.

details

ఆ ఏడాదే సంపూర్ణ చంద్రగ్రహణం

అశ్విని మాసం పౌర్ణమి రోజు అక్టోబర్ 28న చంద్రగ్రహణం సంభవిస్తోంది. 28న అర్ధరాత్రి 1.06 గంటలకు ప్రారంభం కానుందని, మరుసటి గంట అంటే 2.22 గంటల వరకు ఉంటుందని నందింగల్ లక్ష్మీ నరసింహచార్యులు అన్నారు. ఈ మేరకు గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుందన్నారు. అయితే దీన్ని అంశిక చంద్రగ్రహణం అని అంటారని వివరించారు. మరోవైపు 2023లో భారతదేశంలో కనిపించనున్న ఏకైక గ్రహణం ఇదే కావడం గమనార్హం. భారతదేశంలో తదుపరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025న సంభవిస్తుంది. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణంగా, అరుదైనదిగా నిలవనుండటం విశేషం.