మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మారుతీ-సుజుకి NEXA బ్లాక్ ఎడిషన్ మోడల్స్
భారతదేశంలో 40 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణానికి గుర్తుగా, స్వదేశీ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి NEXA సిరీస్ లో ప్రత్యేక బ్లాక్ ఎడిషన్ మోడల్స్ ను విడుదల చేసింది. అన్ని కార్లు ప్రత్యేక 'పెరల్ మిడ్నైట్ బ్లాక్' పెయింట్ స్కీమ్‌తో వస్తున్నాయి. మారుతీ సుజుకి ప్యాసింజర్ వెహికల్ కేటగిరీలో 40% పైగా మార్కెట్ వాటాతో భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఎదిగింది. "ఇండియా కమ్ హోమ్ ఇన్ ఎ మారుతీ సుజుకి" అనే ట్యాగ్‌లైన్ ప్రకటనలలో వాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా ప్రజాదరణ పొందుతోంది ఈ బ్రాండ్. NEXA సిరీస్ లో ఇగ్నిస్, బాలెనో, సియాజ్, XL6, గ్రాండ్ విటారా, ప్రతి వాహనం ఈ బ్లాక్ పెయింట్ తో వస్తున్నాయి.
టాటా మోటార్స్ డార్క్ ఎడిషన్ నుండి స్పూర్తి పొందిన మారుతీ-సుజుకి
మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీని కూడా అందిస్తోంది, మోడల్ ఆధారంగా ఇది రూ. 17,890 నుండి రూ. 39,990 వరకు ఉండచ్చు. ఇందులో డోర్ వైజర్లు, క్రోమ్ గార్నిష్, సీట్ కవర్లు, స్టీరింగ్ కవర్, డిజైనర్ మ్యాట్స్, ఇల్యూమినేటెడ్ సిల్ గార్డ్, బాడీ సైడ్ మోల్డింగ్‌లు, విండో ఫ్రేమ్ కిట్, కుషన్లు, నంబర్ ప్లేట్ గార్నిష్, వాక్యూమ్ క్లీనర్ వంటి అనేక రకాల వస్తువులు ఉన్నాయి. టాటా మోటార్స్ డార్క్ ఎడిషన్, స్కోడా రాపిడ్ బ్లాక్ కలర్ ఎడిషన్లకు డిమాండ్‌ను చూసిన తర్వాత వినియోగదారులను ఆకర్షించడానికి బ్లాక్ పెయింట్ ను ఎంచుకుంది.