Page Loader
థ్రెడ్స్ యాప్‌కు భారీ రెస్పాన్స్.. నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల డౌన్‌లోడ్స్
నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల డౌన్ లోడ్స్

థ్రెడ్స్ యాప్‌కు భారీ రెస్పాన్స్.. నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల డౌన్‌లోడ్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2023
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రారంభించిన థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విట్టర్ కు పోటీగా మెటా కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ను తీసుకొచ్చింది. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ట్విట్టర్ తరహా ఫీచర్లతోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. థ్రెడ్స్ యాప్ ప్లేస్టోర్‌లోకి అందుబాటులోకి తెచ్చిన నాలుగు గంటల్లోనే ఐదు మినియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అదే విధంగా ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ థ్రెడ్స్ యాప్‌లో తన తొలి పోస్టును చేశారు. థ్రెడ్ యాప్ డౌన్‌లోడ్స్ దూకుడు చూస్తుంటే ట్విటర్ ను మించిపోతాయా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి థ్రెడ్‌ యాప్‌లో Instagram IDతో లాగిన్ చేసుకోవచ్చు

Details

థ్రెడ్ యాప్ కు కొంత సమయం అవసరం

థ్రెడ్స్ లో వెబ్ లింక్‌లు, ఫోటోలు గరిష్టంగా ఒకేసారి 10, నిమిషం వరకు వీడియోలను, 500 వరకు వర్డ్స్ ను పోస్టు చేయోచ్చు. అదే విధంగా ఎవరినైనా బ్లాక్ చేయడంతో పాటు ఫాలో కూడా కావొచ్చు. ఒకవేళ మీరు ఇన్ స్టాగ్రామ్‌లో ఎవరినైనా బ్లాక్ చేసి ఉంటే థ్రెడ్స్‌లో సైతం ఆ ఆకౌంట్స్ బ్లాక్ లిస్టులో ఉంటాయి. ట్విటర్‌ను 'థ్రెడ్స్‌' మించిపోనుందనే వార్తలపై జుకర్‌బర్గ్‌ స్పందించారు. దీనికి కొంత సమయం పడుతుందని, వంద కోట్ల మంది ఖాతాదారులతో ఓ పబ్లిక్‌ కన్వర్జేషన్‌ యాప్‌ ఉండాలని తాను భావిస్తున్నానని, ట్విట్టర్ కు ఆ అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయిందని, ఆ ఘనతకు తాము సాధిస్తామని స్పష్టం చేశారు.