LOADING...
Meta: సీనియర్ సిటిజన్లను సైబర్ మోసాల బారి నుంచి రక్షించడమే లక్ష్యంగా.. మెటా కొత్త యాంటీ-స్కామ్ ఫీచర్ 
మెటా కొత్త యాంటీ-స్కామ్ ఫీచర్

Meta: సీనియర్ సిటిజన్లను సైబర్ మోసాల బారి నుంచి రక్షించడమే లక్ష్యంగా.. మెటా కొత్త యాంటీ-స్కామ్ ఫీచర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి కొత్త చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, కంపెనీ కొత్త సెక్యూరిటీ ఫీచర్స్,అవేర్‌నెస్ టూల్స్ను ప్రారంభించింది. ముఖ్యంగా, సైబర్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించడమే ఈ కొత్త ఫీచర్స్ లక్ష్యం. వాట్సాప్‌లో తెలియని వ్యక్తితో తమ స్క్రీన్‌ను షేర్ చేసిన సమయంలో వార్నింగ్‌ మెస్సేజ్‌ వస్తుందని మెటా కంపెనీ పేర్కొంది. ఎందుకంటే, చాలా స్కామర్స్ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు వంటి సున్నితమైన సమాచారంను చోరీ చేస్తారని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్త టూల్, అనుమానాస్పద కార్యకలాపాలపై యూజర్లకు హెచ్చరికలు అందిస్తుంది. అలాగే, మెటా ప్రస్తుతం మెసెంజర్‌లో AI ఆధారిత స్కామ్ డిటెక్షన్ సిస్టమ్ ను పరీక్షిస్తుంది.

వివరాలు 

21,000కంటే ఎక్కువ ఫేక్ పేజీలు,అకౌంట్లను తొలగించిన కంపెనీ 

అనుమానాస్పద మెస్సేజ్‌లు వస్తే.. యూజర్‌ను హెచ్చరిస్తుంది. వినియోగదారులు కోరినట్లయితే, చాట్‌ను AI స్కానింగ్ కోసం పంపే సౌలభ్యం కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. అదనంగా,ఫేస్‌ బుక్, మెసెంజర్, వాట్సాప్‌లో పాస్‌కీస్ ఫీచర్ను జోడించడం ద్వారా, యూజర్ల ఫింగర్‌ప్రింట్,ఫేస్, పిన్‌ ఐడీలను భద్రంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా,ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌లోని 'సెక్యూరిటీ చెకప్' ఫీచర్ యూజర్లకు తమ అకౌంట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ సమీక్షించడానికి అవకాశం ఇస్తుంది. వాట్సాప్‌లో 'ప్రైవసీ చెకప్' యూజర్లు వారిని గ్రూప్‌లకు ఎవరు చేర్పించాలో నిర్ణయించడంలోనూ సహాయపడుతుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో,మయన్మార్,లావోస్,కంబోడియా,యూఏఈ,ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి ఎనిమిది మిలియన్లకుపైగా స్కామ్ అకౌంట్లను బ్లాక్ చేసినట్లు మెటా వెల్లడించింది. అంతేకాక,కస్టమర్ సపోర్ట్ పేరుతో మోసం చేసే 21,000కంటే ఎక్కువ ఫేక్ పేజీలు,అకౌంట్లను తొలగించామని కంపెనీ పేర్కొంది.