Loading...
Meta India Policy Chief: భారత ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకునే దిశగా మెటా ప్లాన్‌...కొత్త చీఫ్‌ కోసం వేట..
భారత ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకునే దిశగా మెటా ప్లాన్‌...కొత్త చీఫ్‌ కోసం వేట

Meta India Policy Chief: భారత ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకునే దిశగా మెటా ప్లాన్‌...కొత్త చీఫ్‌ కోసం వేట..

వ్రాసిన వారు Balachander Sharma
Nov 19, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ మాతృసంస్థ మెటా కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో పబ్లిక్ పాలసీ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ స్థాయి అధికారిని నియమించాలని చూస్తోంది. బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. ఈ పోస్టు కోసం సంస్థ ప్రస్తుతం అన్వేషణ సాగిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ ఉద్యోగానికి సంబంధించి బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం మెటాలో సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న అమన్ జైన్ భారత్‌లో ప్రభుత్వ సంబంధాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త అధికారి నియమితులైన తర్వాత ఆయన ఆ అధికారి పరిధిలో పనిచేయనున్నారు.

Details

మెటాకు భారత్‌ ఎందుకంత కీలకం?

ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులు ఉన్న మార్కెట్లలో భారత్‌ మెటాకు అత్యంత కీలకం.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ ద్వారా కోట్లాది మంది భారతీయులకు చేరువైన సంస్థకు ఇక్కడ వ్యాపార విస్తరణకు కూడా మంచి అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలోనూ భారత్‌ ప్రాధాన్యం పెరుగుతోంది.

మెటా అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ లామా (Llama) ఏఐ మోడళ్లను పరీక్షించడానికి, వాటి వినియోగాన్ని విస్తరించడానికి భారత మార్కెట్‌ కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు, డిజిటల్ నిబంధనలపై అవగాహన ఉన్న నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సంస్థ భావిస్తోంది.

Details

వాట్సాప్‌ కొత్త ఫీచర్‌పై ప్రభుత్వ అభ్యంతరాలు

మెటా, భారత ప్రభుత్వానికి మధ్య విభేదాలు రావడానికి వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌ కూడా ఒక కారణమైంది.

ఈ ఫీచర్‌ ద్వారా ఫోన్‌ నంబర్లు పంచుకోకుండానే ఇతరులతో కనెక్ట్‌ కావచ్చు. అయితే, దీనివల్ల ఆన్‌లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉందని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్‌లో వాట్సాప్‌కు 65 కోట్లకు పైగా వినియోగదారులు ఉండటంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రభుత్వ ఆందోళనల నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర కంటెంట్‌ను తగ్గించడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్‌ పోస్టును తాత్కాలికంగా పరిమితం చేసిన ఘటనపై మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయెల్ కప్లాన్ ఆగస్టులో భారత అధికారులకు క్షమాపణలు చెప్పారు.

ADVERTISEMENT

Details

గూగుల్‌ వంటి సంస్థలకూ ఇదే సవాలు

భారత్‌లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం మెటాకు మాత్రమే కాదు, ఇతర టెక్‌ దిగ్గజాలకూ సవాలుగా మారింది.

ఐటీ నిబంధనలు, కంటెంట్ తొలగింపు, యాప్‌లపై చర్యల విషయంలో గూగుల్‌ కూడా ప్రభుత్వంతో నియంత్రణపరమైన చర్చలను ఎదుర్కొంది.

గత ఏడాది ఆల్ఫాబెట్‌ తన భారత పాలసీ బృందంలో మార్పులు చేయగా, ఇటీవల ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్‌గా అంతర్గత వ్యక్తిని ప్రమోట్‌ చేసింది.

ఈ పరిణామాలు చూస్తుంటే భారత మార్కెట్లో వ్యాపారాన్ని విస్తరించాలనుకునే టెక్‌ కంపెనీలకు ప్రభుత్వ సంబంధాలు, పబ్లిక్ పాలసీ విభాగాలు ఎంత కీలకంగా మారాయో అర్థమవుతోంది.

ADVERTISEMENT