
MetaOrion AR glasses: మెటా నుంచి ఫ్యూచరిస్టిక్ ఓరియన్ ఏఆర్ గ్లాసెస్.. మెదడుతోనూ ఆపరేట్ చేయొచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
మీరు ఫోన్‌ను తాకకుండా, కూర్చున్న చోట నుంచే వీడియోకాల్ లిఫ్ట్ చేయగలుగుతారు.
మొబైల్ అవసరం లేకుండా రెసిపీలు ఎలా తయారుచేయాలో కూడా తెలుసుకోవచ్చు.
ఇదంతా సాధ్యమవుతుంది మెటా ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ద్వారా.
మెటా కనెక్ట్ 2024 (Meta Connect 2024) ఈవెంట్‌లో కంపెనీ ఓరియన్ (Orion) పేరిట ఈ ఏఆర్ హెడ్సెట్‌ను పరిచయం చేసింది.
ఇది మెదడు నుంచి వచ్చే సంకేతాలను ఆధారంగా పని చేస్తుంది.
వివరాలు
సాధారణ కళ్లజోడుల్లా ట్రాన్స్‌పరెంట్‌గా..
ఓరియన్ అనేది ఫేస్ కంప్యూటర్ వలె పనిచేస్తుంది. ఈ గ్లాసులు సాధారణ కళ్లజోడుల్లా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి.
వీటిని ధరించినప్పుడు, మీరు ఎదురుగా ఉన్న వ్యక్తులను సాఫీగా చూడగలుగుతారు. గ్లాసులు తక్కువ బరువుతో ఉంటాయి, అందువల్ల ఇంట్లో కానీ బయట కానీ వీటిని సులభంగా ఉపయోగించవచ్చు.
ఈ ఓరియన్ గ్లాసెస్ ఏఐ వాయిస్ అసిస్టెన్స్, హ్యాండ్ ట్రాకింగ్, ఐ ట్రాకింగ్, రిస్ట్ బేస్డ్ న్యూరల్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా పనిచేస్తాయి.
మెదడు సంకేతాలను ఈ గ్లాసెస్ గుర్తించి వివిధ పనులను నిర్వహిస్తాయి.
మెటా ఏఐ అనుసంధానం ఉన్న ఈ గ్లాసెస్ మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువును గుర్తిస్తుంది.
వివరాలు
2027 నాటికి ఈ పరికరం అందుబాటులోకి..
ఉదాహరణకు, మీవద్ద ఉన్న పదార్థాలతో ఒక వంటకాన్ని తయారుచేయాలని అనుకుంటే, వాటిని ఆ గ్లాస్‌తో చూడగానే రెసిపీ పక్కన ప్రత్యక్షమవుతుంది.
ఫోన్ అవసరం లేకుండా మీరు వీడియో కాల్‌లను కూడా లిఫ్ట్ చేయవచ్చు. ఈ సిస్టమ్ మూడు భాగాల పరికరాలతో వస్తుంది—ఓరియన్ గ్లాసెస్, న్యూరల్ రిస్ట్‌బ్యాండ్ (కంట్రోల్ కోసం), వైర్‌లెస్ బ్యాటరీ ప్యాక్.
మెటా ఈ పరికరాల ఫోటోను తన బ్లాగ్‌లో పంచుకుంది, డెమో సమయంలో దీని పనితీరు అద్భుతంగా ఉందని తెలిపింది.
2027 నాటికి ఈ పరికరం వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఎంపిక చేసిన ఉద్యోగులకు ముందుగానే ఓరియన్ గ్లాసెస్‌ను అందజేస్తున్నట్లు కూడా పేర్కొంది.
వివరాలు
ఎంఆర్ హెడ్ సెట్స్
ఇదే ఈవెంట్‌లో, మెటా మిక్స్‌డ్ రియాలిటీ (MR) హెడ్‌సెట్లను కూడా పరిచయం చేసింది.
క్వెస్ట్ 3ఎస్ (Quest 3S) పేరుతో రెండు వేరియంట్లను విడుదల చేసింది. 12జీబీ వేరియంట్ ధర $299.99 (సుమారు రూ.25,000), 256జీబీ వేరియంట్ ధర $399.99 (సుమారు రూ.33,000).
ఈ హెడ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌ఆర్2 జెన్2 ప్రాసెసర్‌పై ఆధారపడి పనిచేస్తుంది.
అక్టోబర్ 15 నుండి ఈ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. క్వెస్ట్ 3ఎస్ రాకతో క్వెస్ట్ 2 తయారీని నిలిపివేయనున్నారు. అంతేకాదు వాటి విక్రయాలపై రాయితీలను అందించనున్నారు.