Microsoft Teams : టీమ్స్ కొత్త ఫీచర్… ఆఫీస్ ఎంట్రీ-ఎగ్జిట్ ఆటో ట్రాకింగ్.. ఎలాగంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా ఉద్యోగులు కార్యాలయానికి ఎప్పుడొచ్చారు,ఎప్పుడెళ్లారన్న వివరాలు ఇకపై స్వయంగా బయటపడే అవకాశం ఉంది. ఆఫీస్ వై-ఫైకి కనెక్ట్ అయిన వెంటనే యూజర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించే కొత్త ఫీచర్‌పై మైక్రోసాఫ్ట్ పని చేస్తోంది. ఈఫీచర్‌ను విండోస్,మ్యాక్ కంప్యూటర్లలో 2026 ఫిబ్రవరి నుంచే విడుదల చేయాలని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఆరంభంలో టీమ్స్‌లో వై-ఫై ఆధారంగా యూజర్ లొకేషన్‌ను ట్రాక్ చేసే సిస్టమ్ తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మైక్రోసాఫ్ట్ 365 రోడ్‌మ్యాప్ (ID 488800)లో భాగంగా,ఆఫీస్ వై-ఫైకి డివైస్ కనెక్ట్ అయిన వెంటనే యూజర్ పనిచేసే బిల్డింగ్ వివరాలను ఆటోమేటిక్‌గా టీమ్స్‌లో అప్‌డేట్ చేసే ఫీచర్‌ను ప్రవేశపెట్టనుందని వెల్లడించింది.
వివరాలు
వై-ఫైకి కనెక్ట్ అయిన వెంటనే యూజర్ బిల్డింగ్ వివరాలు స్వయంగా అప్డేట్ అవుతాయి
"సంస్థ వై-ఫైకి కనెక్ట్ అయిన వెంటనే యూజర్ ఉన్న బిల్డింగ్ వివరాలు స్వయంగా అప్డేట్ అవుతాయి" అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీని వల్ల ఉద్యోగి కంపెనీ నెట్‌వర్క్‌లోకి వచ్చిన వెంటనే ఆ సమాచారం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్‌కు చేరే అవకాశం ఉంది. ఈ లొకేషన్ వివరాలను ఎవరు చూడగలరన్న విషయంపై మైక్రోసాఫ్ట్ స్పష్టత ఇవ్వకపోయినా, దీనిని తప్పుగా ఉపయోగిస్తే ఉద్యోగులు ఎప్పుడొచ్చారు, ఎప్పుడు వెళ్లారు అన్నదాన్ని మేనేజర్లు గమనించే అనైతిక నిఘా పద్ధతిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
సెట్టింగ్స్‌ను డిఫాల్ట్‌గా ఆన్ చేయచ్చు
అయితే ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లోనే ఉంటుందని, అవసరమైతే సంస్థ అడ్మినిస్ట్రేటర్లు మాత్రమే ఆన్ చేయగలరని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. అయినప్పటికీ వచ్చే ఏడాది ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు లేదా కార్యాలయాలకు తిరిగి రావాలన్న నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి కొందరు యాజమాన్యాలు ఈ సెట్టింగ్స్‌ను డిఫాల్ట్‌గా ఆన్ చేయొచ్చన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.