LOADING...
 Microsoft:  మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఒక నెలలో 10లక్షల కోడ్ లైన్లు AI తో రీ-రైట్
మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఒక నెలలో 10లక్షల కోడ్ లైన్లు AI తో రీ-రైట్

 Microsoft:  మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఒక నెలలో 10లక్షల కోడ్ లైన్లు AI తో రీ-రైట్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కోడింగ్ పరంగా పెద్ద మార్పులకు సన్నద్ధమవుతోంది. ఈ దశాబ్దం చివరికి, సంస్థ తన ఉత్పత్తులలో ఉపయోగిస్తున్న C, C++ కోడ్‌ను రద్దు చేసి, దానిని రస్ట్ (Rust) ప్రోగ్రామింగ్ భాషతో భర్తీ చేయాలని భావిస్తోంది. దీనిపై మైక్రోసాఫ్ట్‌ నుంచి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. సంస్థలోని సీనియర్ ఇంజినీర్ గాలెన్ హంట్‌ ఈ విషయాన్ని లింక్డిన్‌ వేదికగా వెల్లడించారు ఈ మార్పును సాధించడానికి కృత్రిమ మేధను (AI) విస్తృతంగా ఉపయోగించాలనుకుంటున్నారని ఆయన చెప్పారు.

వివరాలు 

వేలలైన కోడ్‌లను రాయడానికి ఎక్కువ సమయం

హంట్ తన పోస్టులో వెల్లడించినట్టు, సంస్థ ఒక ఇంజినీర్ ఒక నెలలో 10 లక్షల లైన్ల కోడ్‌ను రాయగలగాలని ఆశిస్తోంది. పాత కోడ్‌ను తిరిగి రాయడం సులభం కాదని, వేలలైన కోడ్‌లను రాయడానికి ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ దృష్ట్యా మైక్రోసాఫ్ట్ ఈ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నంలో ఉంది. AI ఏజెంట్లను ఉపయోగించి ఈ భారీ పనిని పూర్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే, శక్తివంతమైన కోడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారని గాలెన్ హంట్ తెలిపారు. రస్ట్ భాష మెమరీ సేఫ్టీ, పనితీరు పరంగా సిస్టమ్-లెవెల్ ప్రోగ్రామింగ్‌లో ఆదరణ పొందింది, దాంతో ఈ మార్పు సహజమేనని వారు పేర్కొన్నారు.

Advertisement