Page Loader
Moto G35 5G: మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన మోటోరొలా.. వివరాలు ఇవే..
మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన మోటోరొలా.. వివరాలు ఇవే..

Moto G35 5G: మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన మోటోరొలా.. వివరాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2024
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా తమ 'జీ' సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది మెటో జీ35 5జీ పేరుతో విడుదలైంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 5,000mAh బ్యాటరీ వంటి ముఖ్యమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మోటో జీ35 5జీ కేవలం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4జీబీ+128జీబీ మోడల్‌ను రూ.9,999 ధరకే అందిస్తున్నారు. ఇది రెడ్, లీఫ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ వంటి రంగుల్లో లభించగా, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరొలా రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు 

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌

ఫీచర్ల విషయానికొస్తే, 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్ సాంప్లింగ్ రేటుతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ ఫ్లూయిడ్ పనితీరును అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హల్లో యూఐ స్కిన్‌పై నడుస్తున్న ఈ ఫోన్ వెనుకవైపు 50 ఎంపీ క్వాడ్ పిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్‌ను కలిగి ఉంది, ఇక ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అందించబడింది.

వివరాలు 

5,000mAh బ్యాటరీ 

డాల్బీ అట్మోస్ సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు, IP52 రేటింగ్‌తో లెదర్ ఫినిష్ ఉన్న ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 20W వైర్డ్ ఛార్జింగ్ సౌకర్యం కల్పించబడింది. కనెక్టివిటీ ఫీచర్లలో డ్యూయల్ హ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.