
Motorola: మోటరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్.. శక్తివంతమైన కెమెరా ఫీచర్లతో సూపర్బ్!
ఈ వార్తాకథనం ఏంటి
మోటరోలా భారత మార్కెట్‌లో తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో పేరుతో వచ్చిన ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది.
రూ.35,000 లోపు ఉత్తమ ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇది మంచి ఎంపిక కావచ్చు. IP68, IP69 రేటింగ్‌లతో దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే శక్తివంతమైన కెమెరా, భారీ బ్యాటరీతో వస్తోంది.
ఇప్పుడు దీని ఫీచర్లు, ధరపై ఒకసారి చూద్దాం. ఈ ఫోన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రవేశపెట్టనున్నారు.
ఎడ్జ్ 60 సిరీస్‌లో మూడవ ఫోన్, ఫ్యూజన్, స్టైలస్ వేరియంట్ల తర్వాత ప్రీమియం సెగ్మెంట్‌లో లభిస్తుంది.
Details
డిస్‌ప్లే
6.7 అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ POLED స్క్రీన్
గరిష్ఠ బ్రైట్‌నెస్: 4500 నిట్స్
రిఫ్రెష్ రేట్: 120Hz
స్టైలిష్ లుక్, స్టీరియో స్పీకర్లు
ప్రొటెక్షన్
IP68, IP69 రేటింగ్‌లతో దుమ్ము, నీటి నుంచి రక్షణ
బ్యాటరీ
6000mAh కెపాసిటీ
90W ఫాస్ట్ చార్జింగ్ (చార్జర్ బాక్స్‌లోనే అందుతుంది)
15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
ప్రాసెసర్, RAM, స్టోరేజీ
మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్
12GB LPDDR5X RAM * 256GB UFS 4.0 స్టోరేజ్
Android 15తో ప్రీ-ఇన్‌స్టాల్డ్
3 ఏళ్ల OS, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు హామీ
Details
కెమెరా
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
50MP సోనీ లైటియా 700C ప్రైమరీ కెమెరా (OIS తో)
50MP అల్ట్రావైడ్ కెమెరా (మాక్రో విజన్‌తో)
10MP 3x టెలిఫోటో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 50MP సెల్ఫీ కెమెరా
ధరలు
8GB RAM + 128GB స్టోరేజ్ - రూ. 29,999
12GB RAM + 256GB స్టోరేజ్ - రూ. 33,999
కలర్ వేరియంట్లు: పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, షాడో, స్పార్క్లింగ్ గ్రేప్
Details
అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫామ్స్
ఫ్లిప్‌కార్ట్
మోటరోలా అధికారిక వెబ్‌సైట్
ప్రధాన రిటైల్ షాప్స్
మే 7 నుంచి కొనుగోలుకు అందుబాటులో
ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్, ప్రీమియం స్పెసిఫికేషన్లతో మంచి విలువనిస్తుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, ఇది తప్పకుండా పరిశీలించదగ్గ ఎంపిక.