
Motorola Edge 60 Stylus: మోటోరొలా ఎడ్జ్ 60 స్టైలస్ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్.. ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా (Motorola) తాజాగా తన ప్రొడక్ట్ లైనప్‌ను మరింత విస్తరిస్తోంది.
ఎడ్జ్ సిరీస్ ఫోన్లతో ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కంపెనీ, ఇప్పుడు అదే సిరీస్‌లోని తాజా మోడల్ అయిన మోటో ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) ను విడుదల చేసింది.
సాధారణంగా స్టైలస్ సదుపాయం ఎక్కువగా శాంసంగ్ వంటి ప్రీమియం బ్రాండ్‌ల ఫోన్లలో కనిపిస్తుంటుంది.
అయితే, ఇప్పుడు మోటో ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉండే ధరతో తీసుకువచ్చింది.
వివరాలు
డిస్‌ప్లే, ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్
మోటో ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ 6.7 అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేతో వస్తోంది.
ఇది 120Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉండి, HDR10+ సపోర్ట్‌ను అందిస్తుంది.
పనితీరు పరంగా చూస్తే, ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉపయోగించారు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఔట్ ఆఫ్ ద బాక్స్ లభిస్తుంది.
కెమెరా ఫీచర్లు:
ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం మోటో ఈ ఫోన్‌లో శక్తివంతమైన కెమెరాలను అందిస్తోంది.
వెనుక భాగంలో 50 ఎంపీ ప్రాధమిక కెమెరా, అదనంగా 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది.
వివరాలు
బ్యాటరీ, ఛార్జింగ్:
ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
బాక్స్‌లోనే ఛార్జర్ అందించబడుతుంది. అంతేకాకుండా, 15W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఇతర ముఖ్యమైన ఫీచర్లు:
మోటో ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్‌లో IP68 రేటింగ్, Wi-Fi 6 సపోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 3.5 మిల్లీమీటర్ల హెడ్‌ఫోన్ జాక్ వంటి అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి.
వివరాలు
స్టైలస్ ప్రత్యేకతలు:
ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణ స్టైలస్. ఇది ఫోన్‌లోనే ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. బయటకు తీయగానే నోట్స్ యాప్ స్వయంగా ఓపెన్ అవుతుంది.
దాంతో మీరు తక్షణమే రాయడం ప్రారంభించి, అవసరమైన సమాచారాన్ని నోట్స్‌గా సేవ్ చేసుకోవచ్చు.
Sketch to Image ఫీచర్ ద్వారా మీరు వేసిన డ్రాయింగ్‌ను చిత్రరూపంలోకి మారుస్తుంది. అలాగే చిన్న చిన్న గణిత సమస్యల పరిష్కారానికి కూడా ఈ స్టైలస్ ఉపయోగపడుతుంది.
వివరాలు
ధర,అమ్మకాల సమాచారం:
ఈ ఫోన్‌ను ఒకే వేరియంట్‌లో విడుదల చేశారు. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్. దీని ధరను కంపెనీ రూ.22,999గా నిర్ణయించింది.
యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ద్వారా అదనంగా రూ.1,000 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటో అధికార వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.