LOADING...
Sunita Williams: నాసాకు గుడ్‌బై చెప్పిన సునీతా విలియమ్స్
నాసాకు గుడ్‌బై చెప్పిన సునీతా విలియమ్స్

Sunita Williams: నాసాకు గుడ్‌బై చెప్పిన సునీతా విలియమ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత వంశానికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన వృత్తి జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా నుంచి పదవీ విరమణ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ రిటైర్మెంట్ నిర్ణయం గతేడాది డిసెంబరు 27 నుంచే అమల్లోకి వచ్చిందని నాసా తాజాగా స్పష్టం చేసింది. ప్రస్తుతం 60 ఏళ్ల వయసున్న సునీతా విలియమ్స్ 1998లో నాసాలో చేరారు. దాదాపు 27 సంవత్సరాల పాటు వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కాలంలో మూడు అంతరిక్ష మిషన్లలో పాల్గొని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపిన ఆమె, తొమ్మిది సార్లు స్పేస్‌వాక్‌లు చేసి అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

27 ఏళ్ల సేవల తర్వాత నాసా నుంచి సునీతా విలియమ్స్ రిటైర్మెంట్

Advertisement