
ISRO-NASA : 'ఇస్రోపై నాసాకు చాలా గౌరవం, కానీ చంద్రయాన్- 3 తర్వాత..'
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రతిష్టాత్మకమైన అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా భారతదేశంపై ప్రశంసల జల్లు కురిపించింది.
ఈ మేరకు తమకు ఇస్రోపై చాలా గౌరవం ఉందని, చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత ఆ గౌరవం మరింత ఇనుమడిస్తోందని కీర్తించింది.
ఈ క్రమంలోనే నాసా డైరెక్టర్ లారీ లెషిన్ ప్రఖ్యాత భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోను పొగడ్తలతో ముంచెత్తింది.
మరోవైపు అమెరికా, భారత్ దేశాలకు చెందిన ప్రఖ్యాత ఇస్రో, నాసాలకు చెందిన ఉమ్మడి మిషన్ ప్రాజెక్ట్ NISARను 2024 మొదటి త్రైమాసికంలో ప్రారంభించబోతున్నాయి.
వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్‌ను ఉపయోగించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో,యునైటెడ్ స్టేట్స్‌లోని నాసా ఉమ్మడి మిషన్ వచ్చే ఏడాది ప్రయోగానికి సిద్ధమవుతోంది.
details
అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే కీలక సాంకేతిక భాగస్వామ్యం : నాసా డెరెక్టర్ లారీ లెషిన్
ఇదే సమయంలో వాతావరణ మార్పులను అధ్యయనం కోసం 2024 మొదటి త్రైమాసికంలోనే ఈ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఆఫ్‌కు సెట్ చేస్తున్నారు.
ISRO-ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) వాతావరణ సమస్యలను పరిష్కరించడమే కాకుండా భూకంపాలు, సునామీలను అంచనా వేయడంలోనూ సహాయపడుతుంది.
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ - NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ లారీ లెషిన్ ఇరు దేశాల మధ్య అంతరిక్ష సహకారాన్ని ప్రశంసించారు.
ఇది అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక భాగస్వామ్యమని పేర్కొన్నారు.
బెంగుళూరులోని జేపీఎల్(JPL)కు చెందిన లాబోరేటరీలో నాసా సహోద్యోగులు ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లో భుజం భుజం కలిపి పని చేయడం చాలా ఉత్సాహంగా ఉందన్నారు.