నాసా సృష్టించిన అద్భుతం: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి
అంగారక గ్రహం మీదకు మనుషులను పంపించేందుకు నాసా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాసా రోవర్ సాధించిన ఘనత కారణంగా మరికొద్ది రోజుల్లో మనుషులని పంపే అవకాశం ఉందని అర్థమవుతోంది. అంగారక గ్రహాన్ని అన్వేషించడానికి నాసా పంపిన పర్స్ వారెన్స్ రోవర్, అంగారక గ్రహం మీద ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసింది. ఈ రోవర్ లోని MOXIE పరికరం అంగారక గ్రహం మీద ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసింది. 122గ్రాముల ఆక్సిజన్ ని పర్స్ వారెన్స్ రోవర్ ఉత్పత్తి చేసిందని, దాని పరీక్షించగా 98శాతంగా స్వఛ్ఛంగా ఉందని నాసా పేర్కొంది. అంటే, భవిష్యత్తుల్లో అంగారకుడి మీద మానవులు వెళ్ళడానికి మరెంతో సమయం పట్టదని అర్థమవుతోంది.