Loading...
NASA PROMISE Rover: చంద్రుడిపై చీకటి ప్రాంతాల్లోనూ పరిశోధనలు.. నాసా కొత్త ప్లాన్
చంద్రుడిపై చీకటి ప్రాంతాల్లోనూ పరిశోధనలు.. నాసా కొత్త ప్లాన్

NASA PROMISE Rover: చంద్రుడిపై చీకటి ప్రాంతాల్లోనూ పరిశోధనలు.. నాసా కొత్త ప్లాన్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 22, 2026
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాసా రూపొందిస్తున్న PROMISE రోవర్‌.. బ్లూ ఆరిజిన్‌ సంస్థకు చెందిన 'బ్లూ మూన్‌ మార్క్‌ 1' ల్యాండర్‌ ద్వారా చంద్రుడిని చేరుకోనుంది. ఈ ప్రయాణం 2028 చివర్లో ప్రారంభం కానుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతం శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తికరమైన ప్రదేశం. అక్కడ కొన్ని ప్రాంతాల్లో సూర్యరశ్మి ఎప్పుడూ పడదు. ఫలితంగా ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ రోవర్‌ పనిచేసేందుకు ప్లూటోనియం-238 ఆధారిత ఆర్టీజీ (RTG) విద్యుత్‌ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇది సూర్యరశ్మిపై ఆధారపడకుండా విద్యుత్‌, వేడిని అందిస్తుంది.

Details

పాత రోవర్ల విడిభాగాలతో కొత్త ప్రయోగం

ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. నాసా అంగారక గ్రహంపై పరిశోధనలు చేసిన క్యూరియాసిటీ, పర్సెవరెన్స్‌ రోవర్లకు సంబంధించిన అందుబాటులో ఉన్న విడిభాగాలను PROMISEలో తిరిగి ఉపయోగించనుంది.

దీనివల్ల కొత్త పరికరాల తయారీకి పట్టే సమయం, ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే అంతరిక్ష పరిశోధనల్లో పరీక్షించిన సాంకేతికతను ఉపయోగించడం వల్ల ప్రాజెక్టుకు అదనపు ప్రయోజనం చేకూరనుంది.

Details

ఒక మీటర్‌ లోతు వరకు తవ్వే డ్రిల్

చంద్రుడి ఉపరితలంపై తిరగడమే కాకుండా, దాని లోపల ఏముందో తెలుసుకునే పరికరాలు కూడా ఈ రోవర్‌లో ఉంటాయి.

దాదాపు ఒక మీటర్‌ లోతు వరకు తవ్వగల డ్రిల్‌ను ఇందులో అమర్చనున్నారు. ప్రత్యేక సెన్సర్లు, పరిశోధనా పరికరాల సాయంతో నీటి మంచు (Water Ice), ఇతర సహజ వనరుల ఉనికిని గుర్తించేందుకు ప్రయత్నిస్తారు.

ముఖ్యంగా సూర్యరశ్మి చేరని ప్రాంతాల్లో నీటి మంచు నిల్వలు ఉన్నాయా అనే అంశంపై ఈ పరిశోధనలు కీలక సమాచారం అందించవచ్చు.

ADVERTISEMENT

Details

భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాలకు ఉపయోగం

చంద్రుడిపై నీటి మంచు లభిస్తే భవిష్యత్తులో వ్యోమగాములకు తాగునీరు అందించడంతో పాటు, అవసరమైన ఇతర వనరులను తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి.

అంతేకాదు, చంద్రుడిపై శాశ్వత స్థావరాల ఏర్పాటుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే PROMISE మిషన్‌ను కేవలం మరో రోవర్‌ ప్రయోగంగా చూడలేం.

చంద్రుడిపై మనుషుల భవిష్యత్తు ప్రయాణాలకు అవసరమైన వనరులను ముందుగానే గుర్తించే ప్రయత్నంగా దీన్ని చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT