ప్రకటన రహిత బేసిక్ ప్లాన్ ను దాచిపెడుతున్న నెట్ ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ లో బేసిక్ ప్రకటన-రహిత ప్లాన్ కనిపించడం లేదు. ప్రస్తుతం యూజర్లకు బేసిక్ యాడ్స్ ప్లాన్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్యాక్‌ను అధికారికంగా నిలిపివేయలేదు కానీ అది చిన్న లింక్ క్రింద దాచబడింది. మాములుగా సబ్స్క్రయిబ్ చేసుకోవాల్సినప్పుడు వినియోగదారు ప్లాన్‌ని ఎంచుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది కానీ అది నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పేజీలోని చిన్న లింక్‌లో మాత్రమే ఈ బేసిక్ ప్రకటన రహిత ప్లాన్ కనిపిస్తుంది. కొంతమంది వినియోగదారులు నాలుగు ప్లాన్‌లను చూసినట్లు కూడా చెప్తున్నారు.అయితే దీనిపై నెట్ ఫ్లిక్స్ ఇంకా స్పందించలేదు. నెట్‌ఫ్లిక్స్ ఇటీవలే ప్రకటనలతో కూడిన బేసిక్ ప్లాన్‌ను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది
ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు అన్ని సినిమాలు అందుబాటులో ఉండవు
ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, స్పెయిన్, UK, USలలో ఈ ప్లాన్ ప్రారంభించబడింది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే భారతదేశంలో చౌక మొబైల్ ప్లాన్ రూ. 179కి అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్రకటనలతో కూడిన బేసిక్ ప్లాన్‌ను చేర్చడం ద్వారా ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌ల ప్రభావం ఉండదని నెట్‌ఫ్లిక్స్ గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. బేసిక్ ప్రకటనలు ఉన్న ప్లాన్ లో వీడియో నాణ్యత 720p/HD వస్తుంది. వీక్షకులు గంటకు 4 నుండి 5 నిమిషాల ప్రకటనలను ఎదుర్కొంటారని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. లైసెన్సింగ్ పరిమితుల కారణంగా ఈ ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లకు పరిమిత సంఖ్యలో చలనచిత్రాలు,టీవీ సిరీస్‌లకు కూడా యాక్సెస్ ఉండదు.