LOADING...
Apple: నవంబర్ 11న కొత్త యాపిల్‌ టీవీ,హోమ్‌పాడ్‌ మినీ విడుదలయ్యే అవకాశం
నవంబర్ 11న కొత్త యాపిల్‌ టీవీ,హోమ్‌పాడ్‌ మినీ విడుదలయ్యే అవకాశం

Apple: నవంబర్ 11న కొత్త యాపిల్‌ టీవీ,హోమ్‌పాడ్‌ మినీ విడుదలయ్యే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ మరోసారి కొత్త ఉత్పత్తులతో ముందుకు వస్తోందని సమాచారం. బ్లూమ్‌బర్గ్‌ జర్నలిస్టు మార్క్‌ గర్మన్‌ వెల్లడించిన ప్రకారం, నవంబర్‌ 11న యాపిల్‌ రిటైల్‌ స్టోర్స్‌లో 'ఓవర్‌నైట్‌ రిఫ్రెష్‌' చేయడానికి సిద్ధమవుతోంది. సాధారణంగా ఇటువంటి మార్పులు కొత్త ఉత్పత్తుల లాంచ్‌కు సూచనగా ఉంటాయి. ఈసారి యాపిల్‌ టీవీ, హోమ్‌పాడ్‌ మినీ మోడల్స్‌కి చిన్నపాటి అప్‌గ్రేడ్స్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవి ప్రధానంగా పనితీరు, కృత్రిమ మేధస్సు (AI) అనుసంధానంపై దృష్టి సారించనున్నాయని చెప్పబడుతోంది.

ఊహించిన అప్డేట్స్ 

ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ దిశగా కొత్త మార్పులు

తాజా ఆపిల్‌ టీవీ మోడల్‌ మరింత వేగవంతమైన పనితీరు, మెరుగైన ఎఫిషెన్సీతో రావచ్చని అంచనా. ఇందులో కొత్త ఆపిల్‌ సిలికాన్‌ చిప్స్‌ వాడే అవకాశం ఉంది. ఇక హోమ్‌పాడ్‌ మినీ విషయానికి వస్తే, మెరుగైన ఆడియో నాణ్యతతో పాటు స్మార్ట్‌ హోమ్‌ పరికరాల అనుసంధానం కూడా పెరగవచ్చని సమాచారం. ఈ అప్‌డేట్లు ఆపిల్‌ 'ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌' ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండనున్నాయి. ముఖ్యంగా సిరీకి (Siri) కొత్త ఫీచర్లు, గూగుల్‌ జెమినీ AI మోడల్‌తో అనుసంధానం వంటి మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు.

విడుదల ప్రణాళిక 

విడుదల 2026 ఆరంభానికి వాయిదా పడే అవకాశమూ ఉంది

అయితే గర్మన్‌ హెచ్చరిక ప్రకారం, నవంబర్‌లో లాంచ్‌ జరగొచ్చన్నా, కొత్త పరికరాలు వాస్తవంగా 2026 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. కానీ హాలిడే షాపింగ్‌ సీజన్‌కు ముందు స్టోర్‌ రిఫ్రెష్‌ జరగడం, తక్షణ విడుదలకు సంకేతంగా కూడా చూడొచ్చు. ఇప్పటికే ఆపిల్‌ గతంలో కూడా, పెద్ద ఈవెంట్‌ చేయకుండా, చిన్న మార్పులు ఉన్న ఆపిల్‌ టీవీ, హోమ్‌పాడ్‌ లాంటి ఉత్పత్తులను సైలెంట్‌గా విడుదల చేసిన సందర్భాలున్నాయి.

మార్కెట్ వ్యూహం 

రిటైల్‌ ఉద్యోగులకు ప్రత్యేక సూచనలు

సెలవుల సీజన్‌ దృష్ట్యా ఆపిల్‌ రిటైల్‌ ఉద్యోగులకు నవంబర్‌ 11న "ఓవర్‌నైట్‌ రిఫ్రెష్‌"కు సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కొత్త ఉత్పత్తుల ప్రారంభం కావచ్చో, లేక కొత్త హాలిడే డెకర్‌, డిస్ప్లే మార్పులు మాత్రమే కావచ్చో స్పష్టత లేదు. అయితే యాపిల్‌ టీవీ, హోమ్‌పాడ్‌ మినీ మోడల్స్‌ ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో స్టాక్‌లో లేకపోవడం గమనార్హం. సాధారణంగా ఈ విధమైన స్టాక్‌ తగ్గుదలలు, కొత్త అప్‌డేట్ల విడుదలకు ముందుగా కనిపించే సూచనలు కావడం వల్ల, యాపిల్‌ మరోసారి సైలెంట్‌గా కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు అనిపిస్తోంది.