
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రోపై కొత్త వివాదం.. 'స్క్రాచ్‌గేట్'తో వినియోగదారుల్లో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
ఐఫోన్ 6, 6 ప్లస్ మోడళ్ల సమయంలో 'బెండ్‌గేట్' పేరుతో పెద్ద వివాదం చెలరేగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడళ్లపై ఇలాంటి మరో సమస్య బయటకొచ్చింది. ఈసారి దానికి 'స్క్రాచ్‌గేట్' అని పేరు పెట్టారు. ఆపిల్ తాజా ప్రో మోడళ్లు మార్కెట్లోకి వచ్చిన వారంరోజులు కూడా కాకముందే, వాటి అల్యూమినియం బాడీలపై గీతలు పడుతున్నాయంటూ వినియోగదారులు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. ప్రీమియం ధర పెట్టి కొనుగోలు చేసిన ఫోన్లు ఇలా తేలికగా గీతలు పడటంపై యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వినియోగదారుల ఫోన్లే కాకుండాఆపిల్ స్టోర్లలో డిస్‌ప్లేలో ఉంచిన యూనిట్స్ కూడా తక్కువ సమయంలోనే గీతలు, మచ్చలతో కనిపిస్తున్నాయి.
Details
తాత్కాలిక పరిష్కారం ఏంటి?
సాధారణంగా ప్రతి ఫోన్ వాడుకలో కొన్ని గీతలు పడటం సహజమే. కానీ ఐఫోన్ 17 ప్రో సిరీస్‌లో వాడిన 'ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం' ఇతర మోడళ్ల కంటే చాలా త్వరగా గీతలు పడుతోందని యూజర్లు అంటున్నారు. రంగుల విషయంలోనూ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. లావెండర్, స్కై బ్లూ వంటి లైట్ కలర్స్‌లో గీతలు అంతగా కనిపించకపోతే, కాస్మిక్ ఆరెంజ్ వంటి డార్క్ కలర్స్‌లో మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆపిల్ మాత్రం తమ ఐఫోన్ 17 ప్రో సిరీస్‌లో ఇప్పటివరకు వాడిన అత్యంత బలమైన అల్యూమినియం వాడుతున్నామని చెబుతోంది. కానీ యూజర్లు ఎదుర్కొంటున్న వాస్తవ అనుభవం ఆ వాగ్దానానికి విరుద్ధంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇదే 'స్క్రాచ్‌గేట్' వివాదానికి కారణమైంది.
Details
తాత్కాలిక పరిష్కారం ఏంటి?
కేస్ వాడటం ఉత్తమం. సాధారణ కేస్ గానీ, క్లియర్ కేస్ గానీ వాడితే గీతలు, పడిపోవడాన్ని నివారించవచ్చు. స్క్రీన్ ప్రొటెక్టర్లు, స్కిన్ రాప్స్ వాడటం కూడా ఉపయోగకరమే. ఫోన్‌ని కీలు, ఇతర వస్తువులతో బ్యాగ్‌లో వేసేయకుండా జాగ్రత్త పడితే ఎక్కువ భాగం గీతలు తప్పించుకోవచ్చు. మొత్తానికి గీతలు ఫోన్ పనితీరును ప్రభావితం చేయవు. కానీ యూజర్లు ఇచ్చిన భారీ ధరను దృష్టిలో పెట్టుకుంటే, ఈ గీతలు ప్రీమియం అనుభూతిని తగ్గిస్తున్నాయి. ఆపిల్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అప్పటివరకు 'స్క్రాచ్‌గేట్' వివాదం కొనసాగే అవకాశం ఉంది.