LOADING...
WhatsApp New Feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బిజినెస్ చాట్‌లకు ప్రత్యేక సెక్షన్
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బిజినెస్ చాట్‌లకు ప్రత్యేక సెక్షన్

WhatsApp New Feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బిజినెస్ చాట్‌లకు ప్రత్యేక సెక్షన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. వ్యాపార సంబంధిత సందేశాలను సులభంగా గుర్తించేందుకు, బిజినెస్ చాట్‌లను ఆటోమేటిక్‌గా ప్రత్యేక విభాగంలోకి తరలించే సదుపాయంపై సంస్థ పనిచేస్తోంది. ఈ ఫీచర్‌కు 'ఆటో-ఆర్గనైజ్ బిజినెస్ చాట్' అనే పేరు పెట్టినట్లు సమాచారం. వాట్సాప్ అప్‌డేట్స్‌ను ట్రాక్ చేసే WABetaInfo ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఇది బీటా దశలో పరీక్షలు ఎదుర్కొంటోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమయ్యే తాజా బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించినట్లు తెలుస్తోంది.

వివరాలు

ఎలా పనిచేస్తుంది?

ప్రస్తుతం యూజర్లకు వచ్చే అన్ని మెసేజులు ఒకే చాట్ జాబితాలో కనిపిస్తాయి. వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్‌లు, బిజినెస్ అకౌంట్‌ల నుంచి వచ్చే సందేశాలు అన్నీ కలగలిపి ఉండటం వల్ల అవసరమైన చాట్‌ను గుర్తించడం కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త ఫీచర్ రూపొందిస్తున్నారు. దీని ద్వారా బిజినెస్ ఖాతాల నుంచి వచ్చే చాట్‌లు ఆటోమేటిక్‌గా ప్రత్యేక లిస్టులోకి వెళ్తాయి. దీంతో యూజర్లు వాటిని ఒకే చోట సులభంగా చూడగలుగుతారు.

వివరాలు

24 గంటల తర్వాత ప్రత్యేక విభాగానికి

లభ్యమైన సమాచారం ప్రకారం, బిజినెస్ అకౌంట్‌ల నుంచి వచ్చే సందేశాలు 24 గంటల తర్వాత ప్రత్యేక బిజినెస్ విభాగానికి తరలించబడే అవకాశం ఉంది. అయితే ఏ చాట్‌లు మెయిన్ లిస్టులో ఉండాలి, ఏవి వేరే సెక్షన్‌కు వెళ్లాలి అనే ఎంపికను యూజర్లకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్పామ్ మెసేజులకు చెక్ ఈ ఫీచర్ వల్ల అవసరం లేని ప్రమోషనల్ మెసేజులు, బిజినెస్ నోటిఫికేషన్లు ప్రధాన చాట్‌లను డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. స్పామ్ తగ్గడంతో పాటు, వ్యక్తిగత చాట్‌లను క్రమబద్ధంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.

Advertisement

వివరాలు

ఇంకా అభివృద్ధి దశలోనే

ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉండగా, అధికారికంగా విడుదల కాలేదు. త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చి, తరువాత సాధారణ వినియోగదారులకు విడుదలయ్యే అవకాశం ఉంది. యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్, బిజినెస్ చాట్ మేనేజ్‌మెంట్‌ను మరింత సులభతరం చేసే అవకాశముంది.

Advertisement