Microsoft Teams: wifi ఆధారంగా ఉద్యోగి లోకేషన్ ఆటోమేటిక్‌గా గుర్తించే కొత్త ఫీచర్!
ఈ వార్తాకథనం ఏంటి
హైబ్రిడ్ వర్క్ కల్చర్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఉద్యోగులు ఎక్కడ నుంచి పనిచేస్తున్నారన్నది స్పష్టంగా తెలిసేలా మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలో 'Microsoft Teams' యాప్ మీ పరికరం కనెక్ట్ అయిన Wi-Fi ఆధారంగా మీరు ఆఫీసులో ఉన్నారా, రిమోట్‌గా పనిచేస్తున్నారా అనే సమాచారాన్ని ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయనుంది. మైక్రోసాఫ్ట్ 365 రోడ్‌మ్యాప్‌లో ఈ ఫీచర్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్ నమోదైంది. సంస్థ అంతర్గత Wi-Fiకి కనెక్ట్ అయిన వెంటనే, ఉద్యోగి ఆఫీస్ లోకేషన్ ఆటోమేటిక్‌గా టీంలో అప్‌డేట్ అవుతుంది. ఉదాహరణకు, ఉద్యోగి హైదరాబాద్ క్యాంపస్ Wi-Fiకి కనెక్ట్ అయితే, టీంలో ఆయన ప్రస్తుత వర్క్ లోకేషన్ హైదరాబాద్ ఆఫీస్‌గా మారిపోతుంది.
Details
ప్రైవసీ అంశంపై చర్చనీయాంశం
ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశ్యం — సహోద్యోగులు ఎవరెక్కడ పనిచేస్తున్నారన్న స్పష్టత ఇవ్వడం. హైబ్రిడ్ షెడ్యూళ్లలో ఉండే గందరగోళాన్ని తగ్గించడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ ప్రయత్నం చేస్తోంది. అయితే ఉద్యోగుల ప్రైవసీ అంశం ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆఫీస్‌లోని ప్రైవేట్ లేదా ట్రాకింగ్‌కు దూరంగా ఉండే ప్రాంతాల్లో పనిచేయాలనుకునే వారికి ఇది ఇబ్బందిగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ను 2025 డిసెంబర్‌లో గ్లోబల్‌గా విడుదల చేయాలని, విండోస్, macOS వర్షన్లలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Details
త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు
టీం యాప్‌లో ప్రొడక్టివిటీని పెంచే మరో ఫీచర్ సేవ్ మెసేజ్. దీని ద్వారా వినియోగదారులు ముఖ్యమైన చాట్స్, మెసేజెస్‌ను సేవ్ చేసుకోవచ్చు. తద్వారా, అవసరమైన సమాచారాన్ని వెతకడంలో సమయం వృథా కాకుండా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా కీబోర్డ్ షార్ట్‌కట్‌లను కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా రాబోతోంది. వినియోగదారులు తరచుగా ఉపయోగించే ఐకాన్లు, సింబల్స్, ఫంక్షన్లను తమకు అనుకూలంగా షార్ట్‌కట్‌ల రూపంలో సెట్ చేసుకోవచ్చు.