LOADING...
Google: వ్యక్తిగత డేటా రహస్యంగా ఉంచే గూగుల్ కొత్త ఫీచర్.. 'ప్రైవేట్ AI కంప్యూట్'
వ్యక్తిగత డేటా రహస్యంగా ఉంచే గూగుల్ కొత్త ఫీచర్.. 'ప్రైవేట్ AI కంప్యూట్'

Google: వ్యక్తిగత డేటా రహస్యంగా ఉంచే గూగుల్ కొత్త ఫీచర్.. 'ప్రైవేట్ AI కంప్యూట్'

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తాజాగా "ప్రైవేట్ AI కంప్యూట్ (Private AI Compute)" అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారులు గూగుల్ శక్తివంతమైన జెమినీ (Gemini) AI మోడళ్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, ఈ సాంకేతికత ద్వారా వ్యక్తిగత డేటా పూర్తిగా గోప్యంగా ఉండేలా రక్షణ కల్పించబడుతుంది. ఈ విధానం ఆపిల్‌ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ లాగా పనిచేస్తూ, వినియోగదారుల గోప్యతను కాపాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల వైపు పరిశ్రమలో కొనసాగుతున్న కొత్త ధోరణికి దారితీస్తుంది.

సాంకేతిక ఆవిష్కరణ 

ప్రైవేట్ AI కంప్యూట్ అంటే ఏమిటి? 

గూగుల్ దీన్ని "ప్రైవసీని పెంపొందించే AI టెక్నాలజీ"గా వివరించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో జెమినీ క్లౌడ్ మోడళ్ల కంప్యూటింగ్ శక్తితో పాటు డివైస్‌లోనే డేటా భద్రతను కలిపారు. సులభంగా చెప్పాలంటే.. మన మొబైల్ లేదా పరికరం గూగుల్ అత్యుత్తమ AI సదుపాయాలను ఉపయోగించగలుగుతుంది, ఉదాహరణకు రికార్డింగ్‌లను సారాంశం చేయడం, లేదా సందర్భానుసారమైన సూచనలు ఇవ్వడం వంటి పనులు చేయగలదు. అయితే ఈ ప్రక్రియలో మన వ్యక్తిగత డేటాకు ఎవరూ, గూగుల్ ఇంజనీర్లు కూడా, యాక్సెస్ పొందలేరు.

భద్రతా చర్యలు 

ఇది ఎలా పనిచేస్తుంది? 

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (AI Innovation and Research) జే యాగ్నిక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సిస్టమ్ ప్రత్యేకంగా రూపుదిద్దిన హార్డ్‌వేర్-సెక్యూర్డ్ క్లౌడ్ వాతావరణంలో పనిచేస్తుంది. ఇది గూగుల్ రూపొందించిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs) ఆధారంగా నడుస్తుంది. యూజర్ డివైస్, ఆ క్లౌడ్ మధ్య ఎన్క్రిప్షన్ మరియు రిమోట్ అట్టెస్టేషన్ ద్వారా సురక్షితమైన కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ విధంగా, డేటా ప్రాసెసింగ్ జరిగినప్పటికీ యూజర్ సమాచారం గూగుల్‌కే అందుబాటులో ఉండదు.

పనితీరు పోలిక 

ప్రైవసీ, శక్తివంతమైన AI మధ్య గల దూరాన్ని పూడ్చే సాంకేతికతగా..

పిక్సెల్ ఫోన్లలో ఉన్న "ఆన్-డివైస్ AI" సదుపాయం గోప్యతను కాపాడుతుంది, కానీ ప్రాసెసింగ్ శక్తిలో పరిమితులు ఉంటాయి. "ప్రైవేట్ AI కంప్యూట్" ఈ లోటును పూడుస్తుంది. దీని ద్వారా సున్నితమైన డేటా క్లౌడ్‌లోని జెమినీ మోడళ్లతో ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ గోప్యత మాత్రం కాపాడుతుంది. దీని వల్ల మేజిక్ క్యూలో (Magic Cue), రికార్డర్ యాప్‌లో మరింత వేగంగా, తెలివైన ప్రతిస్పందనలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు మరిన్ని భాషల్లో రియల్ టైమ్ సమ్మరీలు ఇవ్వగలుగుతున్నాయి.

పరిశ్రమ ప్రభావం 

AIలో కొత్త దశ 

గూగుల్ "ప్రైవేట్ AI కంప్యూట్" ఆవిష్కరణతో క్లౌడ్ ఆధారిత AIలో ప్రైవసీ ఫస్ట్ యుగం ప్రారంభమైనట్లయింది. ఇది ఆపిల్ విధానాన్ని పోలినప్పటికీ, జెమినీ మోడళ్ల శక్తితో మరింత విస్తృతంగా పనిచేస్తుంది. AI అసిస్టెంట్లు రోజురోజుకీ వ్యక్తిగతంగా, తెలివిగా మారుతున్న నేపథ్యంలో, గూగుల్ ఈ సాంకేతికత ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టే దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రైవసీ మధ్య సంబంధాన్ని ఈ అభివృద్ధి గణనీయంగా ప్రభావితం చేయనుంది.