Google Maps: గూగుల్ మ్యాప్స్, ఎర్త్‌లో కీలక మార్పులు.. కొత్తగా 80 దేశాలకు సేవలు
గూగుల్ సంస్థ గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లలో కీలక మార్పులను ప్రకటించింది. తాజా అప్డేట్‌లో భాగంగా 80 దేశాల నుండి గూగుల్ వీధి వీక్షణకు కొత్త చిత్రాలను పొందుతుండగా, మెరుగైన ఉపగ్రహ చిత్రాలను పరిచయం చేసింది. గూగుల్ క్లౌడ్ స్కోర్+ అనే AI మోడల్‌ను ఉపయోగించి, మ్యాప్స్, ఎర్త్‌లోని చిత్రాలను మరింత శక్తివంతంగా మార్చింది. ఈ మోడల్ వల్ల మంచు, మేఘాలు, పొగమంచు వంటి వాతావరణ పరిస్థితులను చిత్రాల నుండి తొలగించడం సాధ్యమైంది. ఈ AI టెక్నాలజీతో భూమిపై మరింత స్పష్టమైన, ఖచ్చితమైన చిత్రాలను వినియోగదారులకు అందిచనుంది.
80 సంవత్సరాలకు చరిత్రకు సంబంధించిన ఫోటోలు
గూగుల్ వీధి వీక్షణ సేవను తొలిసారిగా బోస్నియా, నమీబియా, లీచ్‌టెన్‌స్టెయిన్, పరాగ్వే దేశాలకు విస్తరించింది. అలాగే, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కోస్టారికా, డెన్మార్క్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి అనేక దేశాలలో కొత్త చిత్రాలను చేర్చింది. జపాన్, మెక్సికో, స్పెయిన్, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్ వంటి ఇతర దేశాల్లో కూడా ఈ సేవలను మరింత విస్తరించింది. గూగుల్ ఎర్త్‌లో 80 సంవత్సరాల చరిత్రకు సంబంధించిన కొత్త వైమానిక, ఉపగ్రహ చిత్రాలను కూడా ప్రవేశపెట్టింది. 1938లో శాన్ ఫ్రాన్సిస్కో నలుపు-తెలుపు ఫోటోలను, ఓక్లాండ్ ఎయిర్‌పోర్ట్ పైలట్‌లు తీసిన చిత్రాలను ప్రదర్శిస్తూ, గతంలోని పరిశ్రమల రంగం, నేటి రెస్టారెంట్‌లు, క్రూయిజ్ షిప్‌లతో నిండిన మార్పులను స్పష్టంగా చూపిస్తోంది.