Samsung Galaxy M16: M సిరీస్‌లో సరికొత్త ఫోన్లు.. గెలాక్సీ M16, M06 ఫీచర్లు, ధర వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా గెలాక్సీ M06, గెలాక్సీ M16 పేరుతో 5జీ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
ఈ రెండు ఫోన్లలో చాలా వరకు సమానమైన ఫీచర్లు ఉన్నాయి. ప్రధానంగా, అవి ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్‌యూఐ7తో లభించనున్నాయి.
కంపెనీ గెలాక్సీ M16 మోడల్‌కు ఆరేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలు తెలుసుకుందాం.
Details
శాంసంగ్ గెలాక్సీ M16 ఫీచర్లు
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది.
ఐ-కేర్ షీల్డ్, విజన్ బూస్టర్ ఫీచర్లు, మీడియాటెక్ డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్ ఉపయోగించారు.
4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మ్యాక్రో షూటర్, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ధర రూ.11,499 నుంచి ప్రారంభకానుంది.
మింట్ గ్రీన్, బ్లుష్ పింక్, థండర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
మార్చి 5 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
Details
శాంసంగ్ గెలాక్సీ M06 ఫీచర్లు
6.7 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే.
మీడియాటెక్ డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.
128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ ఉంది.
ఔటాఫ్‌ది బాక్స్ వన్‌యూఐ 7తో వస్తుంది.
4 ఏళ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
గ్రీన్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. - ధర రూ.9,499 నుంచి ప్రారంభం.
మార్చి 7 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.