BHIM app: భీమ్ యాప్‌లో కొత్త అప్‌డేట్.. పిన్ అవసరం లేకుండానే చెల్లింపులు!
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం చేయడంతో పాటు వేగాన్ని పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక అడుగు వేసింది. ఎన్‌పీసీఐకి చెందిన ఎన్‌బీఎస్ఎల్ మంగళవారం BHIM యాప్‌లో సరికొత్త బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త అప్‌డేట్‌తో వినియోగదారులు రూ.5,000 వరకు చేసే లావాదేవీలను తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఫింగర్‌ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సులభంగా ఆమోదించవచ్చు. దీంతో ప్రతి చిన్న చెల్లింపుకూ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటివరకు పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల చాలా సార్లు చెల్లింపులు విఫలమవుతున్నాయి. ఈ కొత్త బయోమెట్రిక్ విధానం ద్వారా అలాంటి సమస్యలకు చెక్ పడుతుందని ఎన్‌బీఎస్ఎల్ తెలిపింది.
వివరాలు
రోజువారి లావాదేవీలననింటికీ ఈ ఫీచర్ ఉపయోగం
స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపడం, షాపుల్లో QR కోడ్ స్కాన్ చేయడం, ఆన్‌లైన్ చెల్లింపులు వంటి రోజువారీ లావాదేవీలన్నింటికీ ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఎన్‌బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలితా నటరాజ్ మాట్లాడుతూ.. డిజిటల్ చెల్లింపులను అందరికీ సులభంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. వినియోగదారులు తమ వేలిముద్ర లేదా ఫేస్ అన్‌లాక్‌తో చెల్లింపులను నిర్ధారించడం వల్ల పిన్‌పై ఆధారపడటం తగ్గుతుందని, అదే సమయంలో బయోమెట్రిక్ ఆధారిత భద్రత మరింత బలపడుతుందని వివరించారు.
వివరాలు
రూ.5,000 కంటే ఎక్కువ అయితే యూపీఐ పిన్ నమోదు చేయాలి
బయోమెట్రిక్ డేటా వినియోగదారుడి ఫోన్‌లోనే సురక్షితంగా నిల్వ ఉండటం వల్ల పిన్ షేరింగ్ వంటి ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే భద్రత పరంగా రూ.5,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు మాత్రం యూజర్లు తప్పనిసరిగా యూపీఐ పిన్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద మొత్తాల చెల్లింపులకు అదనపు రక్షణను కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఫింగర్‌ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది.