Reliance Jio 'Happy New Year 2026' : యూజర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జెమినీ ప్రో AIతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) వినియోగదారులకు నూతన సంవత్సర కానుకగా 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' పేరిట కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించింది. తాజా అప్డేట్‌లో భాగంగా మూడు కొత్త రీచార్జ్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటా, వాయిస్ కాలింగ్‌తో పాటు భారీ OTT కంటెంట్, ఆధునిక AI సేవలను బండిల్ చేయడమే ఈ ప్లాన్స్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ముఖ్యంగా గూగుల్‌తో భాగస్వామ్యంలో భాగంగా, హై-టియర్ ప్లాన్స్‌లో Google Gemini Pro AI సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించడం విశేషంగా మారింది. మరి జియో ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్స్ ఏమిటి? వాటిలో వినియోగదారులకు లభించే ప్రయోజనాలు ఏంటి అన్నది పరిశీలిద్దాం.
Details
హీరో అన్యువల్ రీచార్జ్ ప్లాన్
దీర్ఘకాలిక వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ప్లాన్ ధర రూ.3,599. కనెక్టివిటీతో పాటు ప్రొడక్టివిటీకి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5GB డేటా అందించడంతో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా యాక్సెస్ కూడా ఉంటుంది. అదనంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ముఖ్యంగా రూ.35,100 విలువైన 18 నెలల Google Gemini Pro AI సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. AI ఆధారిత పనితీరు, టెక్నాలజీ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.
Details
సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్
ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రధానంగా కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించిన ఈ మంత్లీ ప్లాన్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. తక్కువ కాలవ్యవధి ఉన్నప్పటికీ, అన్యువల్ ప్లాన్‌కు సమానమైన AI ప్రయోజనాన్ని అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. ఇందులో రోజుకు 2GB డేటా (అన్‌లిమిటెడ్ 5G యాక్సెస్‌తో), అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అంతేకాదు నెలకు రూ.500 విలువైన OTT స్ట్రీమింగ్ సేవలు కూడా అందిస్తారు. ఇందులో యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (PVME), సోనీ లివ్, జీ5, Lionsgate Play, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫ్యాన్ కోడ్, హోయిచోయ్ వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి.
Details
ఫ్లెక్సీ ప్యాక్
అదనపు ప్రయోజనంగా ఇందులో కూడా 18 నెలల Google Gemini Pro AI సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఒకే రీచార్జ్‌తో సినిమాలు, సిరీస్‌లు, క్రీడలు, AI టూల్స్ అన్నీ కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. తక్కువ ధరలో డేటా టాప్-అప్‌తో పాటు ఎంపిక చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను అందించే ప్లాన్ ఇది. ఈ ప్లాన్‌కు కూడా 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో 5GB లంప్‌సమ్ డేటా లభిస్తుంది.
Details
ప్యాక్స్‌ను ఎంపిక చేసుకునే అవకాశం
వినియోగదారులు తమ అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్స్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఇందులో ఉంది. జియో ప్రవేశపెట్టిన ఈ 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' ప్రీపెయిడ్ ప్లాన్స్ ను సంస్థ అధికారిక వెబ్‌సైట్, MyJio యాప్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జియో రీటైల్ స్టోర్లలో వినియోగదారులు పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.