LOADING...
NISAR MISSION LAUNCH: నైసర్‌ లాంఛ్- ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
నైసర్‌ లాంఛ్- ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

NISAR MISSION LAUNCH: నైసర్‌ లాంఛ్- ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్,అమెరికా సంయుక్తంగా చేపట్టిన 'నైసర్‌' (NISAR) ఉపగ్రహ మిషన్ ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో, తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, 'GSLV-F16' రాకెట్‌కు సంబంధించిన సాంకేతిక వ్యవస్థల తనిఖీలు కూడా పూర్తి చేసినట్లు ఇస్రో స్పష్టం చేసింది. ఈ మిషన్‌ను ఈరోజు, అంటే జూలై 30న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) నుంచి ప్రయోగించనున్నారు. మొత్తం 2,392 కిలోల బరువున్న 'నిసార్' శాటిలైట్‌ను భారత్ అభివృద్ధి చేసిన 'GSLV-F16' రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి పంపనున్నారు.

వివరాలు 

'నైసర్‌' ప్రయోగ సమయం, లైవ్ ప్రసారం వివరాలు: 

ఈ అత్యంత ప్రతిష్టాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఈ ప్రయోగానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఉపగ్రహాన్ని ఈ రోజు సాయంత్రం 5:40 గంటలకు నింగిలోకి పంపనున్నారు. ఇందుకు సంబంధించి కౌంట్‌డౌన్ ప్రక్రియను నిన్న మధ్యాహ్నం 2:10 గంటలకు ప్రారంభించారు. మొత్తం 27.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం 'GSLV-F16' రాకెట్ ద్వారా 'నిసార్' ఉపగ్రహాన్ని ఆకాశంలోకి పంపించనున్నారు. ఈ ప్రత్యేక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సంబంధించిన లింక్‌ను ఇస్రో ఇప్పటికే పంచుకుంది.

వివరాలు 

ఇస్రో అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ లైవ్ స్ట్రీమింగ్‌

ఇస్రో ప్రకారం,ఈ రోజు సాయంత్రం 5:40కు ప్రయోగానికి సమయం నిర్ణయించగా, లైవ్ ప్రసారం అందించబోయే సమయం సాయంత్రం 5:10గంటలకు ప్రారంభమవుతుంది. ఇస్రో తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ లైవ్ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగానికి సరిగ్గా అరగంట ముందు, యూట్యూబ్ వీడియో లింక్‌పై క్లిక్ చేసి, ఈ చారిత్రక క్షణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో చేసిన ట్వీట్