Loading...
Nominal AI Startup: రికార్డు స్థాయిలో పెరిగిన ఏఐ స్టార్టప్‌ నామినల్‌ వ్యాల్యువేషన్
రికార్డు స్థాయిలో పెరిగిన ఏఐ స్టార్టప్‌ నామినల్‌ వ్యాల్యువేషన్

Nominal AI Startup: రికార్డు స్థాయిలో పెరిగిన ఏఐ స్టార్టప్‌ నామినల్‌ వ్యాల్యువేషన్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 10, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో పనిచేస్తున్న అమెరికా స్టార్టప్‌ నామినల్‌ (Nominal) సంచలన వృద్ధిని నమోదు చేసింది. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే కంపెనీ విలువ మూడు రెట్లు పెరిగి 3 బిలియన్‌ డాలర్లకు చేరింది. సంక్లిష్టమైన హార్డ్‌వేర్‌ వ్యవస్థల ఇంజినీరింగ్‌, టెస్టింగ్‌ కోసం AI ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను నామినల్‌ అభివృద్ధి చేస్తోంది. విమానాలు, న్యూక్లియర్‌ రియాక్టర్లు, స్మార్ట్‌ ఫ్యాక్టరీలు వంటి అత్యంత క్లిష్టమైన వ్యవస్థల పనితీరును పరీక్షించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.

Details

$240 మిలియన్ల కొత్త పెట్టుబడి

తాజాగా నామినల్‌ 240 మిలియన్‌ డాలర్ల Series C ఫండింగ్‌ను ప్రకటించింది.

లైట్‌స్పీడ్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ ఈ రౌండ్‌కు నాయకత్వం వహించగా, ఇన్‌సైట్‌ పార్ట్‌నర్స్‌ సహ-నాయకత్వం వహించింది.

ఈ పెట్టుబడితో కంపెనీ వాల్యుయేషన్‌ ఏకంగా 3 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడాది మార్చిలోనే నామినల్‌ 155 మిలియన్‌ డాలర్ల Series B ఎక్స్‌టెన్షన్‌ను పూర్తి చేసింది.

అప్పట్లో కంపెనీ విలువ 1 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. అంటే కేవలం ఎనిమిది నెలల్లోనే వాల్యుయేషన్‌ మూడు రెట్లు పెరిగింది.

Details

ఇంజినీరింగ్‌లో AIకి కొత్త ఉపయోగం

నామినల్‌ తయారు చేస్తున్న AI ప్లాట్‌ఫామ్‌ సాధారణ చాట్‌బాట్‌ తరహా టెక్నాలజీ కాదు.

భారీ హార్డ్‌వేర్‌ వ్యవస్థలను డిజైన్‌ చేయడం, వాటి పనితీరును పరీక్షించడం, ఇంజినీరింగ్‌ ప్రక్రియలను మెరుగుపరచడం వంటి క్లిష్టమైన పనుల కోసం దీనిని రూపొందించారు.

విమానాలు, అణు రియాక్టర్లు, స్మార్ట్‌ ఫ్యాక్టరీలు వంటి రంగాల్లో చిన్న తప్పిదం కూడా భారీ ప్రభావాన్ని చూపుతుంది.

అలాంటి వ్యవస్థల్లో డేటాను విశ్లేషించి, టెస్టింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయడంలో AIని ఉపయోగించడమే నామినల్‌ ప్రత్యేకత.

ADVERTISEMENT

Details

80 సంస్థలు ఇప్పటికే కస్టమర్లు

నామినల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రస్తుతం 80 వాణిజ్య, ప్రభుత్వ సంస్థలు ఉపయోగిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.

వాటిలో డిఫెన్స్‌ టెక్నాలజీ సంస్థ ఆండ్రిల్‌ కూడా ఉంది. ఈ కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ట్రే స్టీఫెన్స్‌ ఒకరు.

నామినల్‌లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో సీక్వోయా, జనరల్‌ క్యాటలిస్ట్‌, లక్స్‌ క్యాపిటల్‌ వంటి ప్రముఖ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు ఉన్నాయి.

ADVERTISEMENT

Details

ప్రభుత్వ ప్రాజెక్ట్‌తో మరింత బలం

నామినల్‌కు ఇటీవల అమెరికా వైమానిక దళం నుంచి కూడా భారీ అవకాశం వచ్చింది.

అక్టోబర్‌లో 71.2 మిలియన్‌ డాలర్ల STRATFI పెట్టుబడి కోసం కంపెనీని ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో బయట సంస్థల నుంచి కూడా సమాన నిధులు సమకూర్చాల్సి ఉంటుంది.

నామినల్‌ సీఈవో, సహవ్యవస్థాపకుడు కామెరాన్‌ మెక్‌కార్డ్‌ గతంలో అమెరికా నేవీలో సబ్‌మెరైన్‌ అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత ఆండ్రిల్‌లోనూ పనిచేశారు.

ఇప్పుడు ఆయన నేతృత్వంలోని కంపెనీ AIని కేవలం సాఫ్ట్‌వేర్‌ రంగానికే పరిమితం చేయకుండా, క్లిష్టమైన భౌతిక ప్రపంచంలోని హార్డ్‌వేర్‌ వ్యవస్థలకు తీసుకెళ్తోంది.

ADVERTISEMENT