
Nothing Ear (Open) TWS: : భారత మార్కెట్లో నథింగ్ 'Ear (Open)' TWS ఇయర్‌బడ్స్ లాంచ్.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నథింగ్ సంస్థ తన కొత్త 'Nothing Ear (Open)' TWS ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడల్ గతేడాది సెప్టెంబర్‌లో పరిచయం చేశారు. కంపెనీ ప్రథమంగా ఓపెన్ ఇయర్ స్టైల్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లో అందించింది. డిజైన్ ఇవి ప్రత్యేక పేటెంట్ పెండింగ్ డయాఫ్రాగమ్ డిజైన్, టైటానియం కోటింగ్, అల్ట్రా లైట్ డ్రైవర్, స్టెప్ప్డ్ డిజైన్‌తో వస్తాయి. ఈ ప్రత్యేక డిజైన్ డిస్టర్షన్‌ను తగ్గిస్తూ, లో ఫ్రీక్వెన్సీలను మెరుగుపరుస్తుంది. టైటానియం కోటింగ్ వల్ల హై నోట్లు స్పష్టంగా వినిపిస్తాయి. ఇయర్ హుక్‌లో నికెల్ టైటానియం వైర్ వాడటం వల్ల ఫ్లెక్సిబుల్, దృఢంగా ఉంటుంది.
Details
ఆడియో ఫీచర్స్
ఆటోమేటిక్ బాస్ ఎన్‌హాన్స్ అల్గారిథమ్ ద్వారా ఫ్రీక్వెన్సీలు ఆప్టిమైజ్ అవుతాయి, మంచి బాస్ అనుభవాన్ని అందిస్తాయి. అలాగే క్లియర్ వాయిస్ టెక్నాలజీ వల్ల గాలి శబ్దం ఎక్కువగా ఉన్నా కూడా స్పష్టమైన కాల్స్ చేయవచ్చు. స్మార్ట్ ఫీచర్స్ ఈ ఇయర్‌బడ్స్‌లో ChatGPT ఇంటిగ్రేషన్ ఉంది. AI ఆధారిత ప్రాసెసింగ్‌తో 2.8 కోట్లకుపైగా శబ్ద పరిస్థితులపై ట్రైనింగ్ చేయబడింది. ఇయర్‌బడ్ బరువు 8.1 గ్రాములు, ఛార్జింగ్ బాక్స్ బరువు 63.8 గ్రాములు. వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ IP54 కూడా ఉంది.
Details
బ్యాటరీ & కనెక్టివిటీ
14.2mm డైనమిక్ డ్రైవర్ కలిగిన ఇయర్‌బడ్స్‌లో 64mAhబ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లేదా 6 గంటల టాక్‌టైమ్ అందిస్తుంది. 635mAhఛార్జింగ్ కేస్‌తో కలిపి 30 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 24 గంటల టాక్‌టైమ్ సాధ్యమే. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో 2 గంటల మ్యూజిక్ వినిపిస్తుంది. Bluetooth 5.3సపోర్ట్, Google Fast Pair, Microsoft Swift Pair, డ్యూయల్ కనెక్షన్, 120ms లో ల్యాగ్ మోడ్, పించ్ కంట్రోల్స్ (ప్లే/పాజ్, ట్రాక్ స్కిప్, కాల్ అన్‌సర్/రిజెక్ట్, ANC/ట్రాన్స్‌పరెన్సీ మోడ్ స్విచ్, వాల్యూమ్ కంట్రోల్) వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Nothing Ear (Open) వైట్ కలర్‌లో Flipkartలో రూ. 9,999 ధరకు అందుబాటులో ఉంది.