LOADING...
Year Ender 2025: నథింగ్ హెడ్‌ఫోన్ నుంచి ఐఫోన్ ఎయిర్ వరకు: 2025లో డిజైన్‌తో దుమ్ము దులిపిన 5 గ్యాడ్జెట్లు ఇవే..
2025లో డిజైన్‌తో దుమ్ము దులిపిన 5 గ్యాడ్జెట్లు ఇవే..

Year Ender 2025: నథింగ్ హెడ్‌ఫోన్ నుంచి ఐఫోన్ ఎయిర్ వరకు: 2025లో డిజైన్‌తో దుమ్ము దులిపిన 5 గ్యాడ్జెట్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత దశాబ్ద కాలంలో గ్యాడ్జెట్ల డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు. పెద్ద బ్యాటరీలు, వేగవంతమైన చిప్‌లు, మెరుగైన కెమెరాలు... ఇవన్నీ ఒకే తరహా రూపకల్పనలో రావడం పరిపాటిగా మారింది. ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో, కాలం గడిచేకొద్దీ వినియోగదారుల ఆసక్తి తగ్గిపోయింది. అయితే 2025లో పరిస్థితి మారింది. డిజైన్ కేవలం బయట అందం వరకే పరిమితం కాకుండా, ఒక ఉత్పత్తి గుర్తింపును, వినియోగదారుడి అనుభూతిని ప్రభావితం చేసే స్థాయికి చేరింది. చేతిలో పట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందో, రోజూ వాడేటప్పుడు ఎంత సౌకర్యంగా ఉంటుందో, మార్కెట్లో బ్రాండ్ తన ప్రత్యేకతను ఎలా చూపించిందో—ఇవన్నీ డిజైన్‌లో కీలకంగా మారాయి.

వివరాలు 

నథింగ్ హెడ్‌ఫోన్ 1 

పాతకాలపు ట్రాన్స్‌పరెంట్ లుక్ నుంచి అల్ట్రా-సన్నని ఇంజినీరింగ్ వరకు, టచ్‌కు బదులుగా స్పష్టమైన ఫిజికల్ కంట్రోల్స్ వరకు—కొన్ని గ్యాడ్జెట్లు మంచి డిజైన్ ఇప్పటికీ చర్చను రేపగలదని, కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయగలదని నిరూపించాయి. నథింగ్ బ్రాండ్ ఎదుగుదల మొత్తం దాని విజువల్ ఐడెంటిటీ మీదే ఆధారపడి ఉంది. హెడ్‌ఫోన్ 1 అయితే ఆ తత్వానికి పూర్తిస్థాయి ప్రతిబింబంలా కనిపించింది. ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లన్నీ నలుపు, వెండి రంగుల్లో ఒకేలా కనిపిస్తున్న సమయంలో, నథింగ్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను ఎంచుకోవడం వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. లోపల ఉన్న భాగాలు,సౌండ్ ఛాంబర్లు కనిపించేలా ఉండటం భవిష్యత్ భావనతో పాటు పాత వాక్‌మ్యాన్,క్యాసెట్ ప్లేయర్ రోజుల్ని గుర్తుకు తెస్తుంది. యాంత్రిక భాగాలు కనిపించడమే అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది.

వివరాలు 

నథింగ్ హెడ్‌ఫోన్ 1 

ఈ నాస్టాల్జియా ఇప్పుడు మరింతగా పనిచేస్తోంది. ఎందుకంటే చాలామంది వినియోగదారులు స్టెరైల్‌గా కాకుండా వ్యక్తిత్వం చూపించే ఉత్పత్తులను కోరుకుంటున్నారు. వాల్యూమ్ కోసం రోలర్, ట్రాక్ మార్చడానికి ప్యాడిల్ స్విచ్, పవర్ కోసం స్లైడర్.. ఇలాంటి ఫిజికల్ కంట్రోల్స్ వెంటనే స్పందన ఇస్తాయి. చూడకుండా కూడా వాల్యూమ్ మార్చడం, పాటలు స్కిప్ చేయడం సాధ్యమవుతుంది. టచ్ జెష్చర్లతో ఇది చాలాసార్లు కష్టమే. ఎక్కువ రోజులు వాడిన తర్వాతే బయటపడే యూజబిలిటీ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్ ఎంపికలు చేసినట్టు అనిపిస్తాయి. బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అల్యూమినియం ఫ్రేమ్ బలంగా ఉంటుంది, ఎక్కువసేపు విన్నా ఇయర్‌కప్స్ అసౌకర్యంగా అనిపించవు.

Advertisement

వివరాలు 

నథింగ్ హెడ్‌ఫోన్ 1 

మెడ చుట్టూ ఫ్లాట్‌గా తిరిగేలా కప్స్ డిజైన్ చేయడం వంటివి నిజ జీవిత వినియోగాన్ని దృష్టిలో పెట్టుకున్నాయని చూపిస్తాయి. హెడ్‌బ్యాండ్ ప్యాడింగ్ తక్కువగా ఉండటం, ఫోల్డ్ కాకపోవడం కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అయినా ఇవన్నీ ఉద్దేశపూర్వక నిర్ణయాల్లానే కనిపిస్తాయి. సౌకర్యం కన్నా క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన హెడ్‌ఫోన్ ఇది.

Advertisement

వివరాలు 

ఓపో రెనో 14 ప్రో 

ఇప్పటి స్మార్ట్‌ఫోన్ డిజైన్ కొంత ఇబ్బందికర దశలో ఉంది. చాలా ఫోన్లు గాజు స్లాబ్‌లా ఒకేలా కనిపిస్తాయి. చిన్న వంకరలు, ఫినిష్‌లు,కెమెరా అమరికలకే పరిమితమైన డిజైన్‌ల మధ్య,ఓపో రెనో 14 ప్రో భిన్నమైన లుక్‌తో ముందుకొచ్చింది. పెర్ల్ వైట్ వేరియంట్‌లో కనిపించే అలల మాదిరి డిజైన్ వెంటనే చూపు ఆకర్షిస్తుంది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు అని ఓపోకు తెలుసు. అయినా ఆ ఎక్స్‌ప్రెషన్ వల్ల ఫోన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా,ఆ లుక్‌కు తోడు బలాన్ని కూడా జోడించింది. ఖరీదైన ఫోన్లు కూడా చాలాసార్లు సున్నితంగా అనిపిస్తాయి. అయితే రెనో 14 ప్రో మాత్రం వాడకంలో నమ్మకం కలిగిస్తుంది.

వివరాలు 

ఓపో రెనో 14 ప్రో 

అల్యూమినియం ఫ్రేమ్,బలమైన గాజు, పలు ఐపీ రేటింగ్‌లు ఉండటంతో ప్రీమియం డిజైన్ అంటే తప్పనిసరిగా నాజూకుగా ఉండాల్సిందే అన్న అభిప్రాయాన్ని ఈ ఫోన్ మార్చింది. ఫ్లాట్ డిస్‌ప్లే రోజువారీ వినియోగాన్ని మరింత సులభం చేస్తుంది. ఒకప్పుడు కర్వ్డ్ స్క్రీన్లు ఫ్యూచరిస్టిక్‌గా అనిపించినా, టైపింగ్, స్క్రోలింగ్, వీడియోలు చూడడంలో ఫ్లాట్ ప్యానెల్స్ సౌకర్యంగా ఉంటాయి. పాత ఐఫోన్ స్టైల్ కెమెరా లేఅవుట్, అతి పలుచని బెజెల్స్ కంటికి హాయిగా కనిపిస్తాయి. బరువు కూడా ఎక్కువగా అనిపించకుండా, బలంగా ఉందనే ఫీలింగ్ ఇస్తుంది. ఇది కేవలం స్పెసిఫికేషన్‌లతో నడిచే ఆండ్రాయిడ్ ఫోన్ కాదు; డిజైన్‌ను విలువిచ్చే వారికి సరైన ఎంపికగా కనిపిస్తుంది.

వివరాలు 

ఐఫోన్ ఎయిర్ 

డిజైన్ కథనాల శక్తిని ఆపిల్ ఎప్పటినుంచో బాగా అర్థం చేసుకుంది. 2025లో విడుదలైన ఐఫోన్ ఎయిర్ ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది. మొదటి టచ్‌లోనే ఇది వేరే ఫోన్ అనే భావన కలుగుతుంది.. కేవలం 5.6 మిల్లీమీటర్ల మందంతో ఉండటం వల్ల ఫోన్ ఫీల్ పూర్తిగా మారిపోయింది. జేబులో పెట్టుకోవడం, ఎక్కువసేపు చదవడం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ఇంత సన్నగా ఉన్నా, గ్రేడ్-5 టైటానియం, సెరామిక్ షీల్డ్ గాజు వాడటం వల్ల ఫోన్ సున్నితంగా అనిపించదు. అందంగా ఉండటం, బలంగా ఉండటం..ఈ రెండింటి మధ్య సమతుల్యత కనిపిస్తుంది. అయితే ఈ డిజైన్ కొంత చర్చకు దారితీసింది. 6.5 అంగుళాల డిస్‌ప్లే పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది.

వివరాలు 

సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ 

డిజైన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో కొన్ని అంశాల్లో రాజీ పడాల్సి వచ్చింది. వేడి నియంత్రణ, బ్యాటరీ సామర్థ్యం పరిమితంగా ఉండటం లాంటి అంశాలు ఉన్నాయి. అయినా డిజైన్ సరిహద్దులను దాటితే కొంత త్యాగం తప్పదని ఇవి గుర్తు చేస్తాయి. చాలా వేరియబుల్ బ్రాండ్‌లు సన్నగా చేయడంపైనే దృష్టి పెట్టిన సమయంలో, శాంసంగ్ మాత్రం భిన్నమైన దారి ఎంచుకుంది. గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్‌లో తిరిగే బెజెల్‌ను తిరిగి తీసుకొచ్చింది. ఇది చాలామంది మిస్సైన ఫీచర్. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, సఫైర్ గ్లాస్, ఫిజికల్ బటన్లు అని కలిసి ఇది నిజమైన వాచ్‌లా అనిపిస్తుంది.

వివరాలు 

సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ 

నోటిఫికేషన్లు చూడడం, వ్యాయామ సమయంలో మెనూలు స్క్రోల్ చేయడం, యాప్‌లు మార్చడం అన్నిఇవన్నీ తిరిగే బెజెల్‌తో టచ్ జెష్చర్ల కంటే కచ్చితంగా అనిపిస్తాయి. కస్టమైజ్ చేయగల క్విక్ బటన్ వాడకాన్ని మరింత సులభం చేస్తుంది. మొదట బరువుగా అనిపించినా, కాలక్రమంలో అదే ప్రీమియం ఫీలింగ్‌గా మారుతుంది. మినిమలిజం మీద మోజు పెరుగుతున్న ఈ సమయంలో, ఇంటరాక్షన్‌కు ప్రాధాన్యం ఇచ్చిన డిజైన్ ఇంకా విలువైనదే అని ఈ వాచ్ గుర్తు చేస్తుంది.

వివరాలు 

వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 3ఆర్ 

2025లో మంచి డిజైన్ అంటే ఖరీదైన ఉత్పత్తులకే పరిమితం కాలేదు.వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 3ఆర్ దీనికి ఉదాహరణ. బడ్జెట్ ఆడియో సెగ్మెంట్‌లో ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ఉండే సమయంలో,వన్‌ప్లస్ మాత్రం ఆలోచనతో కూడిన డిజైన్‌ను తీసుకొచ్చింది. ఆరా బ్లూ వేరియంట్ వెంటనే చూపు ఆకర్షిస్తుంది.మ్యాట్ ఫినిష్,చతురస్రాకారానికి దగ్గరగా ఉండే కానీ మృదువైన అంచులు, మొత్తం లుక్ సరదాగా ఉంటుంది. చూడడానికి ప్రీమియంగా అనిపించదు. సింపుల్‌గా బాగుంటుంది. వాడుకలో కూడా ఇది సహాయపడుతుంది. తేలికగా ఉండటం,సౌకర్యంగా ఫిట్ కావడం,వాటర్ రిసిస్టెంట్ ఇవన్నీ మంచి డిజైన్ ఖరీదైన మెటీరియల్స్ మీదే ఆధారపడాల్సిన అవసరం లేదని చూపిస్తాయి.

వివరాలు 

వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 3ఆర్ 

వేలిముద్రలు పడే గ్లాసీ సర్ఫేస్‌లను తప్పించడం లాంటి చిన్న నిర్ణయాలు రోజువారీ వాడకాన్ని సులభం చేస్తాయి. రద్దీగా ఉన్న బడ్జెట్ మార్కెట్లో, అందుబాటులో ఉండే మంచి డిజైన్ కూడా సాధ్యమే అని ఈ బడ్స్ నిరూపించాయి.

వివరాలు 

అనుభూతిని మార్చిన ప్రతి ఉత్పత్తి 

ఈ ఐదు ఉత్పత్తులను చూస్తే ఒకే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. డిజైన్ ద్వారా వినియోగదారుడితో వ్యక్తిగత అనుబంధం ఏర్పడింది. నథింగ్ ట్రాన్స్‌పరెంట్ నాస్టాల్జియా కావచ్చు, ఓపో బలమైన అందం కావచ్చు,ఆపిల్ అతి సన్నని ప్రయోగం కావచ్చు, సామ్‌సంగ్ టచ్‌కు బదులుగా ఫిజికల్ కంట్రోల్స్ కావచ్చు, వన్‌ప్లస్ అందుబాటులో ఉండే సరదా డిజైన్ కావచ్చు—ప్రతి ఉత్పత్తి అనుభూతిని మార్చింది. చాలా సందర్భాల్లో, ఆలోచనతో చేసిన డిజైన్ లోపాలను కప్పిపుచ్చి రోజువారీ వినియోగాన్ని మెరుగుపరిచింది. 2025లో మంచి డిజైన్ కేవలం చూడటానికి మాత్రమే కాదు—అది అనుభూతిలోనూ కనిపించింది.

Advertisement