
Nothing Ear 3: సెప్టెంబర్ 18న లాంచ్ కానున్న నథింగ్ ఇయర్ 3.. కొత్త టాక్ బటన్ స్పెషల్ ఆకర్షణ
ఈ వార్తాకథనం ఏంటి
మార్కెట్‌లో నథింగ్ బ్రాండ్ ఇయర్‌ఫోన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇంతకుముందు విడుదలైన 'నథింగ్ ఇయర్ 2 బడ్స్' ఇప్పటికే భారీ పాపులారిటీ సాధించాయి. ఇప్పుడు ఈ సక్సెస్‌ను కొనసాగించేలా కంపెనీ కొత్తగా 'ఇయర్ 3 బడ్స్'ను లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన టీజింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఆసక్తి రేపింది.
Details
లాంచ్ డేట్
నథింగ్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా తమ కొత్త 'ఇయర్ 3 బడ్స్'ను సెప్టెంబర్ 18న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా యాపిల్ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎయిర్‌పాడ్స్ ప్రో 3*కు పోటీగా ఈ బడ్స్ వస్తున్నాయని సమాచారం. ఫీచర్స్ డిజైన్ : ఇయర్ 3 బడ్స్ కొత్త ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో, మెటల్ బాడీతో స్టైలిష్‌గా కనిపించనున్నాయి. నథింగ్ ఉత్పత్తుల ప్రత్యేకతగా ఉన్న ట్రాన్స్‌పరెంట్ లుక్ ఇక్కడా కొనసాగనుంది. యాంటెన్నా : ఈసారి కొంచెం పెద్ద సైజ్ యాంటెన్నా కనిపిస్తోంది. దీని వలన మరింత బలమైన బ్లూటూత్ సిగ్నలింగ్ ఉండే అవకాశముందని భావిస్తున్నారు. మెటీరియల్ : బలమైన, డ్యూరబుల్ మెటీరియల్‌తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Details
కొత్త టాక్ బటన్
ఈ బడ్స్‌లో కొత్త టాక్ బటన్ను అమర్చారని, దానిని నథింగ్ తమ ఎక్స్ పోస్ట్‌లో ప్రత్యేకంగా హైలైట్ చేసింది. అయితే ఈ బటన్ ద్వారా ఎలాంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తాయో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇయర్ 3 బడ్స్‌పై పూర్తి వివరాలు, స్పెసిఫికేషన్స్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.